Sunday, May 5, 2024
- Advertisement -

ప్లీన‌రీ వేదికగా వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయం ఇదే..?

- Advertisement -
Ysrcp Pleenary Decides Route Map

వైసీపీ జ‌రుపుకునే ప్లీన‌రీ అట్ట‌హాసంగా మొదలు అయింది. ఈ ప్లీన‌రీని వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్.. పార్టీ భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణకు కావాల్సిన ప్లాన్ ను ర‌చించ‌బోతున్నారు. వైఎస్సార్ 68వ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లో వైఎస్ ఘాట్ వ‌ద్ద కుటుంబ స‌భ్యులంతా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అక్కడికి భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి.. ప్లీన‌రీ వేదిక‌కు వెళ్లారు. ఈ వేదికలో జ‌గ‌న్ తీసుకోబోయే నిర్ణ‌యాలేంటా అనే ఆస‌క్తి కార్య‌కర్త‌ల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది. 2019 ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ సలహాలతో జగన్ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నారు. ధర్నాలు, సభలతో ప్రయోజనం లేదని.. పాదయాత్రల వంటి కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్లాలని ప్రశాంత్ సూచించిన నేపథ్యంలో సుదీర్ఘ పాదయాత్రకు జగన్ సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది చివర్లో పాదయాత్ర మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఏకంగా 8 నెలల పాటు ఈ యాత్ర కొనసాగబోతోంది. పాదయాత్రపై ఇప్పటికే పార్టీ కీలక నేతలతో జగన్ చర్చించారు. వైసీపీ ప్లీనరీలో ఈ పాదయాత్ర గురించి ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వైఎస్సార్ గతంలో నిర్వ‌హించిన పాద‌యాత్ర‌కు సంబంధించి అన్ని వివరాలను అన్వేశిస్తున్నారు. అప్పట్లో వైఎస్ గెలుపుకు పాద‌యాత్ర చాలా మైలేజ్ అయింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను,వారి బాధ‌ల‌ను,క‌ష్టాల‌ను,ద‌గ్గ‌ర‌నుంచి చూసి చ‌లించిపోయిన నాయ‌కుడు ఆయ‌న‌. ప్ర‌జ‌ల సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంద‌ని భావించిన వైఎస్ 2004 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న ప్ర‌క‌టించిన ప‌థ‌కాలు దేశ‌వ్యాప్తంగా పేరుగాంచాయి.

అక్క‌ర‌లేని ప‌థ‌కాలు కాకుండా,ప్ర‌జ‌లకు అవ‌స‌రాన్నిచ్చే ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి,ముఖ్యంగా పేద రైతు గొంతు త‌డిపాడు వైఎస్. ఈ పాదయాత్ర వల్ల చంద్రబాబు ప్రభుత్వాని కూల్చి.. 2009లోనూ ఏ పార్టీతో పొత్తులేకుండా ఎన్నిక‌ల‌ల్లో తన సత్తా చాటారు వైస్. అయితే అప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్రంలో చేవేళ్ల నుండి పాద‌యాత్ర మొదలు పెట్టి.. ఇచ్ఛాపురంలో ముగించాడు. అయితే ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ కూడా ఏపీ మొత్తం పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం. ప్లీన‌రీలో పాద‌యాత్రకు సంబంధించి కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే వీలుంది. అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసేలా.. పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోబోతున్నాడు వైఎస్ జగన్. 

{youtube}jcnE-06t2kM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. టీడీపీకి భయం పట్టుకుంది.. అందుకే రంగంలోకి డిప్యూటీ సీఎం కేఈ
  2. పీకె స‌ల‌హాదారుడు మాత్రమే… పోటీ జ‌గ‌న్ – బాబు మ‌ధ్యే…
  3. జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమెరికా అమ్మాయి
  4. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -