Friday, April 26, 2024
- Advertisement -

బట్టలు లేకుండా అల్లరి నరేష్.. ఏంటి ఇది ?

- Advertisement -

టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో ఎన్నో సినిమాల్లో నటించి హిట్ కొట్టాడు యంగ్ హీరో అలరి నరేష్. వరుస కామెడీ సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రాను రానూ మూస కామెడీ సినిమాలతో వచ్చి ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాడు. దాంతో వరుస ప్లాప్స్ చూశాడు. ఇటీవలే కాస్త డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నప్పటి అవి కూడా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో ఇప్పుడు ఓ ప్రయోగాత్మక సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

నరేష్‌ 57వ సినిమాగా నాంది అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ముఖం నిండా గాయాలతో ఉన్న నరేష్‌ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ రోజు ప్రారంభోత్సవం సందర్భంగా మరో ఇంట్రస్టింగ్ ఫస్ట్‌ లుక్‌ను రివీల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నరేష్ ఒంటి మీద దుస్తులు లేకుండా గాయాలతో తల కిందులుగా వేళాడుతూ ఉన్నాడు. ఎక్కువగా కామెడీ చిత్రాలు మాత్రమే చేసిన నరేష్‌ ఇంక విభిన్న పాత్రలో కనిపించటంతో అభిమానులు షాక్‌ అవుతున్నారు.

విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మరో దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీన్‌, ప్రియదర్శి, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకల సంగీతమందిస్తున్నాడు. అబ్బూరి రవి మాటలు అందిస్తుండగా సిద్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -