Saturday, April 27, 2024
- Advertisement -

అనసూయ జబర్దస్త్ ని వదిలేస్తుందా?

- Advertisement -

అనసూయ భరద్వాజ్ కి తెలుగు టీవీ పరిశ్రమ లో సుమ తర్వాతి స్థానం ఇవ్వచ్చు. ఎలా కెరీర్ మొదలు పెట్టిందో ఎవరికి పెద్దగా గుర్తు లేదు కానీ జబర్దస్త్ షో తో మాత్రం అమాంతం క్రేజ్ ని మూట గట్టుకుంది అనసూయ. అయితే పరసనల్ లైఫ్ లో అంతా సెట్ అనుకున్న సమయం లో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఠానాడైనా మార్క్ ని ప్రదర్శించింది. ఆపై స్పెషల్ సాంగ్స్ కూడా ఒప్పుకుంటూ తన లో ని గ్లామర్ యాంగిల్ ని ప్రేక్షకులకి పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం తనని చాలా మంది దర్శకులు అప్రోచ్ అవుతున్నారట. రంగస్థలం సినిమా లో ని రంగమ్మత్త పాత్ర కి చాలా పేరు వచ్చిన దగ్గర నుండి అనసూయ ని వైవిధ్యభరిత పాత్రల కోసం అడుగుతున్నారట. కాకపోతే ఇటు జబర్దస్త్ షో ని అటు సినిమాల్లో పాత్రలని బాలెన్స్ చేయడం కాస్త కష్టంగా ఉన్నా అనసూయ ఏదో లాగా నెట్టుకొచ్చేస్తుంది.

కాకపోతే ఇటీవలే మీడియా లో ఈ షో ని అనసూయ వదిలేస్తుంది అనే రూమర్స్ వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అని మేము ఆరా తీయగా అనసూయ కి అలాంటి ప్లాన్స్ ఏమి లేవు అని తెలిసింది. ఒకవేళ అనసూయ కి ఆ పరిస్థితే వస్తే మట్టుకు జబర్దస్త్ కి కేవలం తాత్కాలిక విరామం ఇస్తుంది అంట కానీ పూర్తిగా షో ని వదులుకునేందుకు మాత్రం ఇష్టపడదట. కెరీర్ మొత్తాన్ని సెట్ చేసేసిన షో ని అంత ఈజీ గా ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -