Saturday, April 27, 2024
- Advertisement -

మెగాబ్రదర్ నాగబాబుకు సీటు దక్కేనా?

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తులో సీట్లు కొల్పోతున్న నేతలు చాలామందే ఉన్నారు.గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఈసారి ఎన్నికల క్షేత్రంలో దిగేందుకు టీడీపీ – జనసేన నేతలు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా టీడీపీతో పొత్తును జనసేనాని ప్రకటించడంతో ఇరు పార్టీల నేతల గుండెల్లో గుబులు మొదలైంది.

సీటు కొల్పోతున్న నేతలు చాలామంది నిరాశలో మునిగిపోయారు. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదేండ్ల మనోహర్‌ది ఇదే పరిస్థితి. తెనాలి సీటు కోసం టీడీపీ నేతలు గట్టిగా పట్టుబట్టడంతో ఇన్నిరోజులు ఏఏ స్థానంలో ఏ పార్టీ పోటీ చేయాలన్నది ఆలస్యమైంది. ఇక తాజాగా ఇదే బాటలో మెగాబ్రదర్ నాగబాబు కూడా చేరారు.

2019లో నర్సాపురం ఎంపీగా పోటీ చేశారు నాగబాబు. అయితే అప్పుడు పరాభవం తప్పలేదు. దీంతో ఈసారి అనకాపల్లిని సేఫ్ జోన్‌గా ఎంచుకున్నారు. కానీ ఇక్కడ టీడీపీ సీనియర్లు పోటీకి ఆసక్తి చూపిస్తుండటంతో పవన్ తమ్ముడికి సీటు వస్తుందా రాదా అన్న సందేహం అందరిలో నెలకొంది.

ఇక అనకాపల్లిలో కులాల వారీగా ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే కాపు, గవర,వెలమలదే ఆధిపత్యం. ఈ మూడు కులాల నుండే 70 శాతం ఓటర్లు ఉండటంతో నాగబాబు నర్సాపురం కేంద్రంగా కొంతకాలంగా పాలిటిక్స్ చేస్తున్నారు. పలుమార్లు ఈ నియోజకవర్గంలో పర్యటించారు కూడా. కానీ నాగబాబుకు టీడీపీ నేతలు బైర దిలీప్, దాడి వీరభద్రరావు ,చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలా చాలామంది నేతల నుండి తీవ్ర పోటీ ఎదురవుతోంది. అందుకే ఈసారి మెగా బ్రదర్‌కు పోటీ చేసే ఛాన్స్ దక్కుతుందా లేదా కేవలం ప్రచారానికే పరిమితమవుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -