Friday, April 26, 2024
- Advertisement -

హీరోయిన్‌తో హైపర్ ఆది రొమాన్స్.. ఆదిపై ఆరిచిన అనసూయ (వీడియో)

- Advertisement -

బుల్లితెరపై జబర్దస్త్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ షోకు మరీ ముఖ్యంగా హైపర్ ఆది పంచ్‌లకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య ఆది ఏ స్కిట్ చేసిన అందులోకి ఓ సెలబ్రిటీని తీసుకొస్తున్నాడు. ఫేడవుట్ అయిన భామలు, ఫామ్ లో ఉన్న యాంకర్లను జబర్దస్త్ స్టేజ్ మీదకు దింపుతున్నాడు.

అయితే హీరోయిన్స్, యాంకర్స్ వచ్చినప్పుడు ఆది చేసే రొమాన్స్ శృతిమించితోంది. ఇటివలే యాంకర్ మంజూషాను తీసుకొచ్చాడు. ఆమె నోటితో బావా అనిపించుకున్నాడు ఆది. ఇలా తన మనసులోని కోరికను చెబుతున్నాడో.. స్కిట్‌లో భాగంగా చేస్తున్నాడో కానీ హైపర్ ఆది మాత్రం ఇలా ఎవరో ఒకర్నీ తీసుకొచ్చి జబర్దస్త్ పై దుమ్ములేపుతున్నాడు. ఇక తాజాగా జబర్దస్త్ కు సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో హైపర్ ఆది స్కిట్‌లో మాధవీలతా కనిపించింది.

ఈ ప్రోమోలో హైపర్ ఆది, మాధవీలతతో బాగానే రొమాన్స్ చేసినట్టు తెగ ఆడిపాడాడు. హైపర్ ఆది రొమాన్స్‌తో రెచ్చిపోతోంటే.. అనసూయ కోపంగా ఉన్నట్టు కనిపించింది. ఇక చాలు అంటూ కాస్త గట్టిగానే అరిచింది. ఆమెను పట్టుకోనివ్వదు.. వేరే వారిని పట్టుకుంటే తట్టుకోలేదు అంటూ హైపర్ ఆది కౌంటర్ వేయగా.. ఇక్కడేదో కాలుతున్న వాసన వస్తుందే అంటూ అనసూయపై రోజా సెటైర్ వేసింది. మీరూ కూడా ఆ ప్రోమోని చూసేయడి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -