Friday, April 26, 2024
- Advertisement -

లేడీ నిర్మాత ఫోన్ నెంబ‌ర్ సోష‌ల్ మీడియాలో పెట్టి..!

- Advertisement -

ఓ సినిమా లేడీ నిర్మాత ఫోన్ నెంబ‌ర్ ఆన్‌లైన్‌లో పెట్టి వేధిస్తున్నార‌టా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే …ఈ శుక్ర‌వారం విడుద‌లైంది ‘ఈ మాయ పేరేమిటో ‘. అయితే ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో ఉంది. ఈ సినిమాలో ఓ పాత హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బిజెపి మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ సెన్సార్ బోర్డుకి లేఖ కూడా రాశారు. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్న లిరిక్స్ పై సెన్సార్ చైర్మన్ కి ఆయన లేఖ రాశారు.

దీంతో ఈ చిత్ర నిర్మాత దివ్య.. లిరిక్స్ వచ్చిన సమయంలో మ్యూట్ చేశామని, అయినా ఇంకా ఎందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కొంద‌రు నాకు ఫోన్స్ చేసి బెదిరిస్తున్నార‌ని, నా ఫోన్ నెంబ‌ర్‌ని సోష‌ల్ మీడియా షేర్ చేశారని ఆరోపిస్తుంది నిర్మాత దివ్య‌. ఈ సినిమాతో ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ కొడుకు రాహుల్ హీరోగా ప‌రిచియమైయ్యారు. ఈ సినిమాను రాహుల్ సొంత అక్కే నిర్మించ‌డం విశేషం. త‌మ్ముడి కోసం సినిమా చేస్తే ఇలా వివాదాలు సృష్టిస్తున్నార‌ని దివ్య ఆవేద‌న చెందుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -