Friday, April 26, 2024
- Advertisement -

జయప్రకాశ్ రెడ్డి మరణం పై ఆయన భార్య ఏమందంటే..?

- Advertisement -

ఈ ఉదయం టాలీవుడ్ విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.. గుంటూరు లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో మరణించారు. 1988లో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాల్లో నటించారు జయ ప్రకాష్ రెడ్డి.తర్వాత శత్రువు, లారీ డ్రైవర్, బొబ్బిలిరాజా, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడిపంబ, ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, విక్రమార్కుడు, కింగ్, గబ్బర్ సింగ్, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.

జనవరిలో విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో జయ ప్రకాష్ రెడ్డి చివరిగా మనకి తెరపై కనిపించారు.ఇది ఇలా ఉండగా…జయప్రకాశ్ గారి కొడుకు కోడలికి కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. అంతేకాదు జయప్రకాశ్ గారికి గుండెకు సంబంధించిన సమస్య ఏమి లేదని ఆయన భార్య తెలిపారు.

కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో వారిద్దరూ పెంట్ హౌస్ లో ఉంటున్నారు అంట. జయప్రకాశ్ గారి అంత్యక్రియలకు కొడుకు దూరం అవ్వడంతో బంధువులే అంతిమ కార్యాలు నిర్వహిస్తున్నారు అంట. కుటుంబ లో అందరికి కరోనా సోకడంతో జయప్రకాశ్ గారు మానసికంగా కృంగిపోయారు అంట. స్ట్రెస్ ఎక్కువ అవ్వడంతో హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -