Friday, April 26, 2024
- Advertisement -

ఫిలిం స్కూల్ పెట్టనున్న పవన్ కళ్యాణ్

- Advertisement -

రాజకీయాల్లో ఘోరం గా విఫలమైన కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధైర్య పడకుండా తన జనసేన పార్టీ ని పటిష్టం చేసే పని లో నిమగ్నమై ఉన్నారు. అలాగే ఆయన సినిమాల్లోకి రావాలి అని చాలా మంది ఆశిస్తున్నారు కానీ ఆయన మాత్రం మళ్ళీ యాక్టింగ్ చేసే ఆలోచన అయితే లేదు. కాకపోతే సినిమాలకి దగ్గర గా ఉండే లా ఏదైనా చేయాలి అని మాత్రం ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అనే విషయం మాత్రం నిజం. తాజా గా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన ఒక ఫిలిం స్కూల్ ని స్థాపించబోతున్నారు. ఈ ఫిలిం స్కూల్ కి స్వర్గీయ నటులు, ఎస్వీ రంగారావు పేరు ని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

ఈ విషయం జనసేన పార్టీ వర్గాలు ధృవీకరించాయి కూడా. పార్టీ విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ లో ఈ విషయం తెలియజేసారు. పశ్చిమ గోదావరి జిల్లా లో ని పాలకొల్లు లో ఈ స్కూల్ ని స్థాపించబోతున్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు హరిరామ జోగయ్య ఈ స్కూల్ కి చైర్మన్ గా, అలాగే సీనియర్ దర్శకులు రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్ గా ఉండనున్నారట. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ కూడా ఈ ఫిలిం స్కూల్ తో అసోసియేట్ అవ్వనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -