పెళ్లి చేసుకుని.. నా లైఫ్ లో పెద్ద తప్పు చేశా : ప్రగతి ఆంటీ

1982
Pragathi Shocking Comments on Her Life
Pragathi Shocking Comments on Her Life

ఈ మధ్యకాలంలో నటి ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈమె ఎన్నో సినిమాల్లో తల్లిగా, అత్తగా నటించి ప్రేక్షకులను అలరిచింది. అయితే ఈ లాక్ డౌన్ లో షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటూ వర్కౌట్లు చేస్తుంది. అంతేకాదు.. లుంగీ కట్టి మాస్ స్టెప్పులు వేయడం.. అవి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తుంది.

ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పింది ప్రగతి. “ఇండస్ట్రీకి పదహారు, పదిహేడేళ్ల వయసులో వచ్చాను. ఎక్కువగా చదువుకోలేదు. మొదటగా ఓ యాడ్ షూట్ కోసం వచ్చాను. ఆపై హీరోయిన్‌గా మారిపోయాను. ఆ కెరీర్ కూడా త్వరగానే ముగిసిపోయింది. 20 ఏళ్ళకు పెళ్లి చేశారు. చిన్నతనం నుంచి నాపై ఎవరైనా అధికారం, పెత్తనం చలాయిస్తే నాకు నచ్చేది కాదు. అది కూడా ఒక కారణం కావచ్చు. అందుకే ఏడాదిలోనే ఆరేడు తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించాక నాకు అర్థమైంది.

సినిమా ఇండస్ట్రీకి నేను ఫిట్ కాదని అనిపించింది. అందుకే ఇండస్ట్రీకి దూరమైయ్యాను. తర్వాత ఏంటని ఆలోచిస్తే నాకు చిన్నతనంలో పెళ్లి చేశారు. పెళ్లయ్యాక వెంటనే బాబు పుట్టాడు. బరువు, బాధ్యతలు పెరగాయి.. బతకడానికి ఏదో ఒక పని చేయాలి.. నేను చదివిన చదువుకు కనీసం ప్యూన్ ఉద్యోగం కూడా రాదు. నాకు తెలిసింది నటించడమే. మళ్లీ సినిమాల్లోకి అందుకే వచ్చాను. చిన్న వయసులో నేను పెళ్లి చేసుకోవడం తప్పు. నాలా ఎవరు చేయొద్దు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి డబ్బు సంపాదంచినప్పుడే పెళ్లి చేసుకోండి. నా లైఫ్ లో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే ” అని ప్రగతి చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్‌లోకి ఎందుకు వెళ్తారో చెప్పిన ప్రగతి ఆంటీ..!

అందంగా ఉంటే వదలరు వీళ్ళు.. ప్రగతి ఆంటీ సంచలన వ్యాఖ్యలు

ఒంటిపై ఉన్న టాటూ సీక్రెట్ చెప్పిన ప్రగతి ఆంటీ..!

నిజం సినిమాలో నన్ను మోసం చేసి ఆ సీన్స్ తీశారు : రాశీ

Loading...