Friday, April 26, 2024
- Advertisement -

మూడో పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ను చూసి న‌వ్విన రెండో భార్య‌

- Advertisement -

బాలీవుడ్ న‌టుడు రాహుల్‌ మహాజన్ ఎప్పుడు వివాదల‌తోనే సావాసం చేస్తుంటాడు.బిగ్‌బాస్ ద్వారా బాగానే ఫేమ‌స్ అయ్యాడు రాహుల్‌ మహాజన్.తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు రాహుల్‌. ఈ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌ రాహుల్‌ మహాజన్‌ మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. కజక్‌స్తాన్‌ మోడల్‌ నటాల్య ఇలినాను నంవబర్‌ 20న ఆయన పెళ్లాడారు. గ‌తంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని రాహుల్ ఇప్పుడు తాజాగా మూడో వివాహం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.గతంలో పైలట్‌ శ్వేతా సింగ్‌, టీవీ నటి డింపీ గంగూలీని ఆయన పెళ్లిచేసుకుని, విడిపోయారు. కజకిస్తాన్‌ మోడల్‌ నటాల్య ఇలినాను నంవబర్‌ 20న ఆయన పెళ్లాడారు. మహాజన్‌ మూడో పెళ్లిపై ఆయన మాజీ భార్య డింపీ గంగూలీ స్పందించారు.ఈ వార్త విని తనకు మొదట నవ్వు వచ్చిందని వెల్లడించారు. రాహుల్‌, ఇలినా సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

2010లో నేషనల్‌ టీవీలో ప్రసారమైన ‘రాహుల్‌ దుల్హనియా లే జాయేగా’ రియాలిటీ షోలో డింపీ గంగూలీని రాహుల్ రెండో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత 2014, ఫిబ్రవరి 25న వీరు విడాకులు తీసుకున్నారు. తనను దారుణంగా కొట్టేవాడని డింపీ అప్పట్లో ఆరోపించారు. రాహుల్‌ నుంచి విడిపోయిన తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకున్నారు. భర్త, కూతురుతో కలిసి ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. రాహుల్‌ మూడో వివాహంపై డింపీ స్పందిస్తూ.. ‘ఇలినా గృహ హింస బారిన పడకూదని కోరుకుంటున్నా. రాహుల్‌ చాలా మారిపోయి ఉంటాడని అనుకుంటున్న‌ని తెలిపింది డింపీ గంగూలీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -