నన్ను ప్రేమించకుంటే చేయ్యి కోసుకుంటా : రష్మీని బెదిరించిన సుధీర్

3308
rashmi gautam and sudigali sudheer relationship in new jabardasth promo
rashmi gautam and sudigali sudheer relationship in new jabardasth promo

సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. వీరిద్దరికి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవలే జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. ఆయన హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాటకు జబర్దస్త్ కంటెస్టెంట్స్‌తో రష్మి, రోజా కూడా ప్రదీప్‌తో స్టేజ్‌పైకి డ్యాన్స్ చేశారు.

ఇక ప్రదీప్ దగ్గరకు వెళ్లిన రష్మీ సిగ్గుపడుతూ నిలుచుది. ఆమెను చూసిన ప్రదీప్ ‘నేను నీకు ఎలా సాయపడగలను’ అని అడుగుతాడు. ఇందుకు రష్మి.. ‘అదీ అదీ.. ఒకడు ఏడు సంవత్సరాలుగా నా వెంట పడుతున్నాడు’ అని చెప్పి తెగ సిగ్గుపడిపోతుంటుంది. అప్పుడు ప్రదీప్.. ’నేనేం చేయాలో చెప్పు” అంటాడు. అందుకు రష్మీ ’అదే వాడిని ఎలా వదిలించుకోవాలో చెప్పు’ అంటుంది. ఇంతలో సుధీర్.. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి’ పాటతో ఫ్లోర్‌ స్టెప్ వేసుకుంటూ వస్తాడు.

ఆ తర్వాత రష్మిని ఎలా పడేయాలో ప్రదీప్ సుధీర్‌కి సలహాలు ఇస్తాడు. సుధీర్ రష్మీ వద్దకు వెళ్లి ‘రష్మీ ఏడేళ్లు అయిపోయింది. నేను మూడు లెక్క పెట్టేలోపు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకపోతే చెయ్యి కోసుకుంటా’ అని బెదిరిస్తాడు. అప్పుడు రోజా ‘1’ అంటూ లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఆమె తొందర చూసిన సుధీర్ ‘ఏడేళ్లు ఆగరు కదా.. మరో రెండు నిమిషాలు ఆగండి’ అంటాడు. అందుకు రోజా ’ఇంకేం ఆగుతాంలే బోర్ కొట్టేసింది’ అంటూ పంచ్ వేసింది. అందుకు సంబంధించిన వీడియోని మీరు కూడా చూసేయండి.

Loading...