ఇష్టంలేని పెళ్లి.. బలవంతపు శోభనం.. వీడియో వైరల్..!

12306
sin telugu web series official trailer goes viral
sin telugu web series official trailer goes viral

పెద్దలు కుదుర్చే పెళ్లిలో ప్రేమ ఉంటుందా అనేది కొందరి సందేహం. అలాంటి వ్యక్తికి ముక్కూ మొహం తెలియని వాడ్ని ఒక్క ఐదు నిమిషాలు చూసి పెళ్లికి ఓకే చెప్పేయడం ఏంటి?? వాడ్ని ఇచ్చి పెళ్లి చేసేయడం ఏంటి?? రెండు మనసులు ఎలాగూ కలవవు ఈ తక్కువ టైంలో.. రెండు శరీరాలు కూడా అమ్మ చెప్పిన ముహూర్తంలో కలవడం ఏంటి?? దీన్ని కాపురం అంటారా ? ఇలాంటి ప్రశ్నలకు ‘సిన్’ అనే వెబ్ సిరీస్ పరిష్కారం చూపించినట్లుగానే ఉంది.

ప్రస్తుతం సినిమా థియేటర్లు బంద్ కావడంతో అందరు ఓటీటీ యాప్స్‌తో కాలం గడుపుతున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5, ఆహా లాంటి‌ యాప్‌లపై ఆధారపడుతున్నారు. తాజాగా ఆహా యాప్‌లో వస్తోన వెబ్ సిరీస్ ఈ ‘సిన్’ మూవీ. దీనికి సంబంధించిన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది.

బోల్డ్ కంటెంట్ సీన్స్ ఉన్నప్పటికీ అలోచింప చేసే విధంగా ఉంది. . ‘జాగ్వార్’ హీరోయిన్ దీప్తి సతి లీడ్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో తీరువీర్, జెన్నిఫర్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. . ‘జాగ్వార్’ హీరోయిన్ దీప్తి సతి లీడ్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో రవి వర్మ, జెన్నిఫర్‌లు కీలకపాత్రల్లో ఈ సిన్ ప్రోమో ఉంది. నవీన్ మేడారం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడ్యుసర్ శరత్ మరార్ నిర్మించారు. ‘ఆహా’ యాప్‌లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.

Loading...