ట్రైల‌ర్‌లో ర‌చ్చ ర‌చ్చ చేసిన‌ రాయ్ లక్ష్మి

371
Where is venkatalakshmi movie trailer
Where is venkatalakshmi movie trailer

హీరోయిన్ రాయ్ లక్ష్మి అందం , అభిన‌యం రెండు ఉన్న కాలం మాత్రం క‌లిసి రావ‌డం లేదు. ఆమె న‌టించిన సినిమాలు పెద్ద‌గా విజ‌యం సాధించిక పోవ‌డంతో రాయ్ ల‌క్ష్మీ వెలుగులోకి రాలేదు. కాని ఆమె త‌న త‌న హాట్ హాట్ అందాల‌తో బాగానే ఫేమ‌స్ అయింది. మెగా బ్ర‌ద‌ర్స్‌తో ఐటం సాంగ్‌లో న‌టించి మెప్పించింది. తాజాగా ఈ భామ లీడ్ రోల్లో న‌టించిన చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. హార్రర్ కామెడీ‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

ట్రైల‌ర్‌ను చూస్తుంటే రాయ్ లక్ష్మి అందం మీద‌నే ఫోక‌స్ పెట్టిన‌ట్లు అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు హార్రర్ సీన్స్‌ను జోడించారు. . హాస్యనటులు ప్రవీణ్, మధునందన్‌లు రాయ్ లక్ష్మి వెంటపడటం వంటి సీన్స్‌ను ట్రైల‌ర్‌లో చూపించారు. సినిమాను వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఈ సినిమాతో అయిన ల‌క్ష్మి రాయ్‌కు హిట్ కొడుతుందో లేదో చూడాలి.

https://support.google.com/youtube/?p=report_playback