Saturday, April 27, 2024
- Advertisement -

వైఎస్ఆర్ ప్రారంభించిన కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించ‌నున్న జ‌గ‌న్….

- Advertisement -

క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైఎస్ఆర్ ప్రారంభించి ఆగిపోయిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. రచ్చబండను మరోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ‘స్పందన’ పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. ప్రజలపై చికాకులు చూపించకుండా నవ్వుతూ ఫిర్యాదులు స్వీకరించాలని జగన్ అధికారుల్ని కోరారు.

సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించి, స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని అన్నారు. సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారమవుతుందో రశీదు ఇవ్వాలని, అది పరిష్కారమైందో లేదో తెలపాలని ఆదేశించారు. రెండేళ్లలో పాఠశాలల రూపురేఖలు మారాలని, అన్ని స్కూల్స్ ఫోటోలు తనకు పంపాలని చెప్పారు. రైతులు, విద్య, వైద్యం తన ప్రాధాన్యత అంశాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

అధికారులు అకస్మాత్తుగా వారానికి ఒకచోట బసచేయాలని, స్కూల్ లేదా హాస్పిటల్‌లో నిద్రపోవాలని సూచించారు. అక్క‌డికి వ‌స్తున్న‌ట్లు ముందే విష‌యం చెప్ప‌కుండా అకాస్ముత్తుగా వెల్లి త‌నిఖీలు చేయాల‌న్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ససమ్యల్ని అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ఆయన తనయడు, ఏపీ సీఎం జగన్ కూడా అదే బాటలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల … వైఎస్ అభిమానులతో పాటు ప్ర‌జ‌లు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -