Friday, April 26, 2024
- Advertisement -

అర్ధరాత్రి ఏనుగుల బీభ‌త్సం…..ఐదుగురు మృతి…

- Advertisement -

జనావాసాలపై ఓ ఏనుగు దాడిచేసి భీభత్సం సృష్టించ‌డం ఈమ‌ధ్య‌కాలంలో త‌రుచూ జ‌రుగుతున్నాయి. వాటి దాడిలో కొంద‌రు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఐదుగురిని పొట్ట‌న పెట్టుకున్నాయి ఏనుగుల గుంపు. ఈసంఘ‌ట‌న ఒడిస్సాలో చోటు చేసుకుంది.

అంగుల్ జిల్లాలో గురువారం రాత్రి సంభవించిన ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరిలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తాల్చేర్‌ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో ఓ కుటుంబం గురువారం రాత్రి ఇంటి వరండాలో నిద్రపోయారు. వీరు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఢెంకానాల్‌ అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు తప్పించుకొని ఆ ఇంటిపై దాడి చేసింది. వరండాలో నిద్రపోతున్నవారిపై దాడిచేసి తొక్కడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మ‌రో మరో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

మరో ఇంటిపై దాడిచేయడంతో అక్కడ ఓ మహిళ మృతి చెందింది. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆ ఏనుగు దీనికి కొద్ది కిలోమీటర్ల దూరంలోని సంత్‌పద అనే గ్రామంలో మరో ఇంటిపై దాడికి పాల్పడింది. అక్కడ ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. సంఘ‌ట‌న గురించి తెలుసుకున్న పోలీసులు నేనుగుల‌ను అక్క‌డినుంచి త‌రిమికొట్టారు.ఏనుగుల దాడిలో మనుషులు మృత్యువాత పడిన సంఘటనలు ఒడిశాలో తరుచూ చోటుచేసుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -