ట్రంప్ కుమార్తె ఇవాంక ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా ?

3005
ivanka trump floral dress worth rs 1.7 lakh
ivanka trump floral dress worth rs 1.7 lakh

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్ తదితరులు ఉన్నారు. ఈ రోజు అహ్మదాబాద్ లోని ప్రపంచ అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ కూడా వీక్షించారు.

ఇక అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో ట్రంప్, మోడీ ప్రసంగాలు ముగిసిన తర్వాత ఆగ్రా లోని తాజ్ మహల్ ను సందర్శించేందుకు ట్రంప్ వెళ్ళారు. ఇది ఇలా ఉంటే ట్రంప్ కుమార్తె ఇవాంక రంగు రంగుల పూలతో తయారు చేసిన మిడ్డీ డ్రెస్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.

ఆమె వేసుకున్న డ్రెస్ కు పెట్టిన ఖర్చు పై జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె విమానం దిగిన దగ్గర నుంచి తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవాంక ధరించిన డ్రెస్‌ భారత కరెన్సీలో రూ.1.7లక్షలు కావడం విశేషం. గతంలో 2019లో అర్జెంటీనా వెళ్లినప్పుడు చివరిసారిగా ఆమె ఈ డ్రెస్‌ ధరించారు. ఇక స్టేడియంలో ఇవాంక సెల్ఫీలు దిగుతూ చాలా ఉత్సాహంగా కనిపించారు.

Loading...