Saturday, April 27, 2024
- Advertisement -

కులాంతర ప్రేమ వివాహం…కూతురిని అర్థనగ్నంగా ఊరేగిస్తూ చితకబాాదారు

- Advertisement -

మధ్యప్రదేశ్ లో మరోసారి కులం పడగ విప్పింది. తనకు నచ్చిన వ్యక్తితో కలిసి పారిపోయిందనే కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించారు. అమెను పట్టుకొచ్చి చిదకబాదడంతోపాటు…ఊరంతా పరిగెత్తించి కొట్టారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెల్తే…అలిరాజ్‌పూర్‌ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన పందొమ్మిదేళ్ల అమ్మాయి కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. వేరే తెగకు చెందిన వ్యక్తిని ప్రేమించింది.అయితే తమ వివాహానికి ఇరుకుటుంబాలు ఒప్పుకోవని భావించిన ప్రేమికులు, ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో కుమార్తె చర్యతో తమ పరువు పోయిందని భావించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఎలాగో ఆమెను ఇంటికి పట్టుకొచ్చారు.

అనంతరం అర్థనగ్నంగా చేసి ఇంట్లోని వాళ్లంతా ఆమెను చావబాదారు. అలాగే కొడుతూ ఊరిలోని రోడ్ల వెంట తిప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వాట్సాప్ లో వైరల్ గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన అలీరాజ్‌ పూర్‌ ఎస్పీ మాట్లాడుతూ… వాట్సాప్‌ ద్వారా వచ్చిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇంత వరకు తమకు ఫిర్యాదు అందలేదన్నారు.బాధిత యువతి లేదా ఆమె తండ్రి వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాతే చర్యలు తీసుకునే వీలుందని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -