Saturday, April 27, 2024
- Advertisement -

అక్కడ ఒక్క గొర్రె ధర అక్షరాలా మూడు కోట్లు.. ఎక్కడంటే..?

- Advertisement -

మాంసం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.. అందులో మటన్ అంటే మాంసాహారప్రియులకి ఎంతో ఇష్టమైన ఆహారం.. మటన్ అంటే రుచి తో పాటు విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అందుకే మాంసాహారులు ఎంతో ఇష్టపడి ఈ మాంసాహారాన్ని బిజిస్తారు.. అందుకు తగ్గట్లే ఇక్కడ రేట్లు కూడా ఉంటాయి.. మరీ తక్కువ ఉండవు, ఎక్కువ ఉండవు.. తినేవారిని బట్టి రేట్లు కూడా నిర్ణయించబడతాయి.. అయితే తింటూ పోతే కొండైన తరుగుద్ది అన్నట్లు మాసం ఇంతమంది తినే సరికి మాసం ఉత్పత్తి చేసే జంతువులు కూడా అరుదుగా అయిపోతున్నాయి.. అలాంటి ఓ అరుదైన గొర్రె పిల్ల ఏకంగా మూడుకోట్లకు అమ్ముడుపోయింది..

తాజాగా నెదర్లాండ్స్ లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్ ను ఓ కుదుపు కుదిపేస్తుంది.ఇంతకీ విషయం ఏంటంటే ఆరు నెలల డబుల్ డైమండ్ అనే పేరు గల గొర్రె సుమారు ఇండియన్ రూపీస్ ప్రకారం మూడు కోట్లకు ముగ్గురు బ్రీడర్స్ కొనుగోలు చేశారట.మరి ఆరు నెలల గొర్రె పిల్లని అంతా అమౌంట్ పెట్టి ఎందుకు కొనుగోలు చేశారో ఇప్పుడు చూద్దాం

నెదర్లాండ్స్ లోని టెక్సల్ అనే ప్రాంతంలో ఈ బ్రీడ్ గొర్రెలు ఎక్కువగా దర్శనమిస్తాయి. ఇవి భూమి మీద ఉండే గొర్రెలలో రేర్ బ్రీడ్ అని ఇది అంతరించిపోయే జాతులలో ఒకటిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ లాంబ్ సహాయంతో ఆ జాతిని అంతరించిపోయే ముప్పు నుండి బయటకి తీసుకొని రావచ్చని అందుకే ఆ ఆరు నెలల గొర్రె పిల్ల ధర అంత పలికిందని ఈ గొర్రె మాంసం రుచి బాగుండడం వల్లనే ఈ బ్రీడ్ అంతరించిపోయే జాతులలో ఒకటిగా నిలిచిందని అక్కడి వారు అభిప్రాయ పడుతున్నారు.ఇక ఈ తతంగం చూసినవారంతా ఇలాంటిది ఒకటి మనకి దొరికితే బాగుండు రాత్రికిరాత్రే రిచ్ అయిపోవచ్చు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -