Saturday, April 27, 2024
- Advertisement -

ర‌విప్ర‌కాశ్‌, శివాజీల కుట్రను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

- Advertisement -

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌, సినీ నటుడు గరుడ పురాణం శివాజీల టీవీ9 షేర్ల బదలాయింపు వ్యవహారంలో కొత్త కోణం బయటపడుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్‌ ఈ మెయిల్స్‌ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్‌ బయటపడ్డాయి.

రవిప్రకాష్‌ ఈమెయిల్స్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెక్‌ చేశారు. ఒక్కరోజులోనే పాత పేర్లతో షేర్లను రవిప్రకాష్‌ బదిలీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రవిప్రకాశ్‌, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్లు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది.ఈ ఈమెయిల్స్‌ ఆధారంగానే రవిప్రకాష్‌, శివాజీలకు సీఆర్‌పీసీ నోటీసులను పోలీసులు జారీ చేశారు.ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.స‌ర్వ‌ర్ల‌నుంచి డిలీట్ చేసిన మేయిల్స్ ను సైబ‌ర్ క్ర‌మైమ్ పోలీసులు ఆధునిక సాంకేతికి ప‌రిజ్ణానం ఉప‌యోగించి వీటిని వెలికి తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -