Friday, April 26, 2024
- Advertisement -

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం…11 మంది మృతి

- Advertisement -

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో బ‌స్సుడ్రైవ‌ర్‌తో స‌హా 11 మంది అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. 26 మంది గాయ‌పడ్డారు. ప్రయాణీకులతో రాంచీ నుంచి గాయాకు బయల్దేరిన బస్సు రెండో నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. హజారీబాగ్‌ చాపహరణ్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికుల్లో చాలామంది బస్సులో చిక్కుకోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం, గాయపడడం జరిగింది. బాధితులంతా బీహార్‌ వాసులని గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని ధనువాఘాట్‌లో ఇనుప చువ్వలతో వెళ్తున్న ఓ లారీ మరమ్మతులకు గురై ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి పర్యాటకులతో వస్తున్న ఓ బస్సు బ్రేకులు పెయిల్‌ కావడంతో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.దీంతో ఆ రాడ్లు ప్రయాణీకులకు గుచ్చుకోవడం ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటి వరకు 9 మృతదేహాలను బయటకు తీశారు. బస్సును అతివేగంగా నడిపిస్తుండడం వల్ల డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని, అదే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కాగా, గడచిన నాలుగు నెలల కాలంలో ఇదే ప్రాంతంలో పలు ప్రమాదాలు జరగగా 30 మంది మృత్యువాత పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -