Friday, April 26, 2024
- Advertisement -

ఈసీకే అంతు చిక్క‌ని పోలింగ్ శాతం…..

- Advertisement -

తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసి 24 గంటలు గడుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఈసీ ఎంత శాతం పోలింగ్ న‌మోద‌య్యింద‌నే వివ‌రాల‌ను విడుద‌ల చేయ‌లేదు. ఎన్నిక‌లు అంటేనే పోలింగ్ శాతం ఎంత అనేది ప్రధానమైన అంశం. ఆ పోలింగ్ శాతాన్ని బట్టి ఏ పార్టీ విజయం సాధిస్తుందో అన్నది అంచనా వేయవచ్చు.

ఉదయం పోలింగ్ ఎక్కువ అయ్యిందా మధ్యాహ్నాం ఎక్కువ అయ్యిందా లేక సాయంత్రం అయ్యిందా అనే అంశాలను బేరీజు వేసుకుని విజయవకాశాలపై ఆయా పార్టీలు ఓ అంచనాలకు వస్తాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత శాతం పోలింగ్ అయ్యింద‌నేది ఈసీ విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ఇప్పుడు అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది.

జిల్లాల నుంచి ఎన్నికల సంఘానికి ఇంకా సమాచారం రాలేదని ఎన్నికల ప్రధానాదికారి రజత్‌కుమార్ తెలిపారు. తమ వద్ద ఉన్న సమాచారం మేరకు 70 శాతం పోలింగ్ జరిగినట్లు చెప్పిన రజత్.. మరికొన్ని ప్రాంతాల నుంచి రిపోర్ట్ వస్తే పోలింగ్ శాతం మరింత పెరగవచ్చునని వెల్లడించారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ 73 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందని చెప్తుంటే ప్రతిపక్ష పార్టీలు కూడా తమకు తోచిన శాతాన్ని ప్రకటిస్తోంది. 75 శాతం దాటిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే అధికారికంగా ఎన్నికల కమిషన్ మాత్రం ప్రకటించలేదు. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఫెయిల్ అయిందని తెలుస్తోంది. అయితే ఎన్నికల పోలింగ్ శాతాన్ని ప్రకటించేందుకు సిఈవో రజత్ కుమార్ మానిటరింగ్ సెల్ లో కసరత్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -