Friday, March 29, 2024
- Advertisement -

సైలెంట్‌గా ఆంధ్రజ్యోతిని దెబ్బకొట్టిన కేటీఆర్…. రాధాకృష్ణకు షాక్..

- Advertisement -

తెలంగాణా ఎన్నికల సందర్భంగా కుట్రలు, మనీ కట్టలతో కల్వకుంట్లవారిని దెబ్బకొట్టాలని చూసిన వాళ్ళకు సినిమా చూపించడం స్టార్ట్ చేశారు కేసీఆర్ అండ్ కో. చంద్రబాబుతో సహా అందరికీ రిటన్ గిఫ్ట్స్ ఉంటాయి అని ఆల్రెడీ చెప్పినట్టుగానే సినిమా చూపించడం మొదలెట్టారు. ముందుగా లగడపాటి రాజగోపాల్‌తో సర్వే నాటకం ఆడి రచ్చ చేసిన రాధాకృష్ణపై దెబ్బపడింది. ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, స్వయంగా అసెంబ్లీలో ఛానల్ రన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిాడు కేసీఆర్. అయితే ఆ కృతజ్ఙత కూడా లేకుండా తన కులం కోసం, బాబు కోసం కల్వకుంట్ల కుటుంబంపై వ్యక్తిగత ద్వేషపూరిత వార్తలతో కూడా రెచ్చిపోయాడు రాధాకృష్ణ.

ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తున్నాడు. తెలంగాణాలో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత నుంచీ అన్ని మీడియా సంస్థలకు కూడా వ్యక్తిగతంగా నాయకులు, వ్యవస్థలు కూడా కేసీఆర్‌కి అభినందనలు తెలుపుతూ వరుసగా బేనర్ యాడ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే యాడ్స్ ఇచ్చే లిస్టులో నుంచి ఆంధ్రజ్యోతి మీడియాను తీసేసింది కల్వకుంట్ల ఫ్యామిలీ. నాం కే వాస్తేగా చిన్న యాడ్స్ వరకూ ఒకే కానీ పెద్ద యాడ్స్ మాత్రం జ్యోతికి అస్సలు రాకుండా చేసింది. ఇప్పటి మీడియా సంస్థలన్నీ కూడా ప్రజల నుంచి వచ్చే డబ్బుకంటే ప్రకటనలపైనే ఎక్కువ ఆధారపడి నడుస్తున్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వం నుంచి వచ్చే యాడ్స్ కూడా ఆంధ్రజ్యోతికి రాకుండా కేసీఆర్ చేస్తాడనడంలో సందేహం లేదు. అదే జరిగితే మాత్రం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు గడ్డురోజులు మొదలైనట్టే. ఎపిలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రస్తుతానికి ధారాళంగా సీమాంధ్ర ప్రజల సొమ్మును యాడ్స్ రూపంలో ఇస్తూ ఆదుకోవచ్చు. కానీ రేపు ఎపిలో బాబు అధికారం పోతే మాత్రం ఆ తర్వాత కమ్మగా తనకు నచ్చిన సొంత కథలను వార్తాకథల రూపంలో నచ్చినట్టుగా రాసుకుంటూ మీడియాను పాతాళానికి దిగజార్చిన రాధాకృష్ణ మార్క్ జర్నలిజానికి తెలుగునాట శుభం కార్డ్ పడ్డట్టే అన్నది విశ్లేషకుల మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -