టీడీపీకి అమరావతి.. వైసీపీకి విశాఖ.. మరి జనసేనకు ?

793
amaravati vs visakha
amaravati vs visakha

రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో నమ్మకం అనేది ఎప్పటి నుంచో పెద్దగా లేదు. కాకపోతే వందలో ఓ పది శాతం నాయకులపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ రంగులు ఆ ప్రాంతంలో కనపడటం కామన్. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించకముందే.. టీడీపీ నేతలు, టీడీపీ సపోర్టర్లంతా పెద్ద ఎత్తున అమరవతిలో భూములు కొని లాభపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి మొత్తం టీడీపీ నేతల చేతుల్లోనే ఉందని.. వైసీపీ కామెంట్స్ చేసింది.

అమాయకపు రైతుల నుంచి పెద్ద ఎత్తున భూమిని ముందే కొని మోసం చేశారనే అపవాదు కూడా ఉంది. అందుకే చంద్రబాబు, టీడీపీ లీడర్లు లక్షల కోట్లు ఖర్చు చేసి.. అమరావతి రాజధాని కావాలని పోరాడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రాజధానిని అమరావతి నుంచి వైజాగ్ కు తరలిస్తే టీడీపీ గగ్గోలు పెట్టడానికి కారణం ఇదే అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇక ఇదే టైంలో అమరావతిని రాజధానిగా కొనసాగించడం వల్ల వైసీపీకి పైసా లాభం అయితే లేదు. అందుకే వైసీపీ నేతలు ఎక్కువగా భూములు కొన్న విశాఖకు మకాం మార్చాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనూ మూడు రాజధానులు ప్రక్రియ తెరపైకి వచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది.

తాజాగా టీడీపీ మాజీ మంత్రి ఒకరు.. అమరావతిని రాజధాని చేస్తే లక్ష కోట్ల లాభం టీడీపీ నేతలకు అని హాట్ కామెంట్స్ చేశారు. అక్కడ విశాఖను రాజధానిగా చేస్తే వైసీపీ నేతలకు లాభాల పంట పండుతుందని.. రాజధాని అనేది ఒక రియల్ మాఫియా దందా అని స్పష్టం చేశారు. అయితే టీడీపీ, వైసీపీ నేతలు అరాజధాని తమ అవసరాలకు తగ్గట్లు మార్చుకుంటున్నారే తప్పా… ప్రజా అవసరాల కోసం ఈ రాజధాని ఏర్పాటు కాదన్నది కొందరి వాదన. ఐదేళ్లకోసారి అధికారం మారినప్పుడల్లా రాజధాని మారుతూ ఉంది. ఈ ఐదేళ్లలోనే రాజధాని విశాఖలో ఫిక్స్ చేస్తే.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినా ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ వేర్లు కూడా పీకేసిన జగన్.. సరికొత్త చరిత్రను లిఖించాడు..!

గాజువాకలో చిత్తుగా ఓడిపోయాడని.. వైజాగ్ పై పవన్ కి కసి : రోజా

జగన్ తన వ్యూహాలతో బాబును తికమక పెట్టాడు.. ?

మూడు రాజ‌ధానులు.. నాలుగు జోన్లు.. 25 జిల్లాలు.. జ‌గ‌న్ పాలన అదరహో..!

Loading...