Friday, April 26, 2024
- Advertisement -

శత్రువు-శత్రువు భేటి.. బాబులో కలవరం

- Advertisement -

శత్రువు.. శత్రువు కలిశారు.. ఉమ్మడి ప్రత్యర్థిని ఏం చేస్తారు..? ఇప్పుడిదే ఉత్కంఠ టీడీపీ శిబిరాన్ని షేక్ చేస్తోంది. నిన్న తిరుమలకు వచ్చిన మోడీని జగన్ సాదరంగా ఆహ్వానించడం.. మోడీ కాళ్లకు ఆశీర్వాదం తీసుకుంటున్న జగన్ ను వారించి మోడీ జబ్బ చరచడం చర్చనీయాంశమైంది. ఇక తిరుమల దర్శనం చేసిన తర్వాత జగన్ -మోడీ పద్మావతి గెస్ట్ హౌస్ రహస్య భేటి జరిపారన్న వార్త ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక్కొక్కటిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో విచారణ.. కోడెల ఫ్యామిలీపై కేసు నమోదు.. ఇప్పుడు విశాఖ భూముల కుంభకోణంపై విచారణ జగన్ స్పీడు పెంచిన వ్యవహారం టీడీపీని షేక్ చేస్తోంది.

ఇక చంద్రబాబు నిరాకరించిన సీబీఐకి జగన్ అనుమతి ఇచ్చి కేంద్రంలోని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు మోడీ టీడీపీ నేతలను ఏం చేస్తాడనే టెన్షన్ టీడీపీ నేతలను షేక్ చేస్తోంది.

బీజేపీతో దోస్తీ కట్టి విడిపోయి చంద్రబాబు చేసిన ఎత్తులను బీజేపీ మరిచిపోలేదు. మోడీని గద్దెదించేందుకు మాయా, అఖిలేష్, మమత, కుమారస్వామి తదితర ప్రాంతీయపార్టీలతో కలిసి కాంగ్రెస్ కు సపోర్టుగా బాబు చేసిన రాజకీయంపై మోడీ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో బీజేపీకి అనుకూల వైసీపీ ప్రభుత్వం రావడం.. జగన్ మోడీతో అణిగిమణిగి ఉండడంతో టీడీపీలో భయం రెట్టింపు అవుతోంది. ఇప్పుడు మోడీతో జగన్ రహస్య భేటి తర్వాత తమకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే టెన్షన్ టీడీపీ నేతలను వెంటాడుతోంది.

ప్రధానంగా ఏపీలో టీడీపీని నామరూపాల్లేకుండా వచ్చే 2024 ఎన్నికల వరకు చేయాలని బీజేపీ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకోవడం మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచరం. మరి బీజేపీ, వైసీపీ ఎత్తులను టీడీపీ ఎలా కాచుకుంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -