Saturday, April 27, 2024
- Advertisement -

ఇప్పుడు ఎవరు దొంగో ఎవరు దొరో తెలిసిపోతుంది….!!

- Advertisement -

రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం పై ఎంతటి దుమారం రేగిందో అందరికి తెలిసిందే.. ప్రతిపక్షం టీడీపీ అయితే దీన్నో స్వాతంత్య్ర ఉద్యమం గా చేయాలనీ ప్రయత్నించింది. కానీ జగన్ ఎత్తులకు ఆ ఉద్యమం నీరుగారిపోయింది.. తాను చేస్తున్న దానిపై స్పష్టత గా ఉన్న జగన్ అనుకున్నది చేస్తూ రాష్ట్ర బాగోగుల కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని గవర్నర్ దగ్గరినుంచి చాలామంది నేతలను ఒప్పించి మరీ మూడు రాజధనలకు అందరి అనుమతి తీసుకున్నాడు. ఫలితంగా త్వరలోనే మూడు రాజధానులున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతుంది.. అయితే వీటిపై వైసీపీ పార్టీ ఏంటో క్లియర్ గా ఉన్నా రాష్ట్రంలో ఇతర పార్టీ ఒక్కోసారి ఒక్కో వైఖరిని అవలంభిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి..

విశాఖ ప్రాంతంలో రాజధానులు అనుకూలంగానే మాట్లాడుతూ, అమరావతి లో వ్యక్తిరేకంగా మాట్లాడుతున్నారు.. దీంతో రెండు నాల్కల వైఖరిని అవలంభిస్తున్న పార్టీ అసలు గుట్టును ఇప్పుడు కోర్టు సాక్షి గా తేలనుంది.. ఇన్ని రోజులు దాగుడు మూతలు ఆడుతూ వచ్చిన పార్టీ ఇక మూడు రాజధానుల విషయం లో స్పష్టమైన జవాబు ఇవ్వాల్సిందిగా కోర్టు కోరింది.. దాంతో ఎవరు ఏవైపు ఉంటారో స్పష్టంగా తెలుస్తుంది.. తాజాగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను సవాల్‌ చేస్తూ అమరావతి జేఏసీ సహా ఇతరులు దాఖలు చేసిన 79 పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు రాజధానులపై ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటే అఫిడవిట్‌ దాఖలు చేయొచ్చంటూ హైకోర్టు వైసీపీ, టీడీపీ సహా కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయా పార్టీలు ఈ అంశంపై సమాలోచనలు సాగిస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పై ప్రేమ చూపిస్తూనే అమరావతి ని ఏకైక రాజధానిగా చేయాలనీ పట్టుపడుతున్నారు. సీపీఐ చంద్రబాబు ఏ దారిలో నడిస్తే ఆ బాటలో సాగుతోంది. జనసేన , బీజేపీ లు ఈ విషయం పై ఇప్పటికీ స్పష్టమైన జవాబు చెప్పలేకపోతున్నారు.. కాగా పవన్ నేడు వీడియో కాన్ఫిరెన్స్ లో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.. మరి అన్ని పార్టీ లు అమరావతి పట్ల వైఖరి ని తెలిపితే ఎవరు ఏ పక్క ఉన్నారన్నది తెలిసి ప్రజలకు కూడా అన్ని పార్టీల ముసుగులు తెలుస్తాయి.. మరి ఏ పార్టీ ఏవిధమైన అఫిడవిట్‌ దాఖలు చేస్తాయో చూద్దాం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -