ఏపీ సీఎం జగన్ చూసి మేము నేర్చుకోవాలి : ఆమ్రపాలి

1480
IAS Officers Impressed With CM YS Jagan Work
IAS Officers Impressed With CM YS Jagan Work

కలెక్టర్ ఆమ్రపాలి ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. తెలంగాణ కలెక్టర్ అయినప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. కలెక్టర్ కూడా అభిమానులు ఉంటారా అనే కదా మీ అనుమానం. అవును కలెక్టర్ ఆమ్రపాలి కి చాలా మంది అభిమానులు ఉన్నారు. రాజకీయ నాయకులకు సినీ తారలకు ఉండే ఫాలోయింగ్ ఆమెకు ఉంది. పని లోనూ తన జీవితంలోనూ ప్రత్యేకత కనపరచుతారామె. సంప్రదాయ చీరకట్టులో.. మోడ్రన్ దుస్తుల్లోనూ కనిపిస్తారు.

ఆమె గతంలో ట్రెక్కింగ్ కూడా చేశారు. ఆమ్రపాలి పేరు మీద కొన్ని ఫేస్ బుక్ పేజీలు కూడా ఉన్నాయంటే ఆమెకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అతి చిన్న వయసులోనే కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. టాలెంట్ తో పాటు మంచి అందం కూడా ఆమె సొంతం కావడంతో ఆమ్రపాలి చాలామంది ఫాలో అవుతుంటారు. 2010లో సివీల్స్ రాసి 39 వ ర్యాంకు సాధించారు. సొంత రాష్ట్రం ఐఏఎస్ గా ఎంపికయ్యారు. 2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా చేశారు. ఇక కలెక్టర్ గా ఉండి కూడా ఒంటరిగా అడవిలోకి వెళ్లి మరి అక్కడ వాతావరణం పరిస్థితులను గమనించారు. ప్రజలకు కావలసిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆమ్రపాలి ముందు వరుసలో ఉంటారు. అందుచేతనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆమెకు తన విధుల్లొ పూర్తి స్వేచ్ఛనిచ్చారు.

తాజాగా ఆమె ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడి సంచలనం రేపారు. ఏపీ సీఎంగా జగన్ ప్రజలకు చాలా మంచి పని చేస్తున్నారు అని కితాబిచ్చారు. సీఎం జగన్ గారు ఓ మీటింగ్ లో చెప్పారు. మనం ప్రజా పాలకులం కాదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని.. జగన్ గారు చెప్పింది అక్షరాలా నిజం మేము ప్రజాపాలన కాదు ప్రజా సేవకులు ప్రజలకు కావలసింది చేయాలి దాని కోసమే మేము పని చేస్తున్నామని ఆమె తెలిపారు. ఏపీ సీఎం జగన్ గారిని చూసి మేము చాలా నేర్చుకోవాలని ఆమ్రపాలి తెలిపారు. ఆయన ఓ రాజకీయ నాయకుడు అయ్యి ఉండి కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగిలాగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. మేము కూడా ఆయనను ఫాలో కావాలని చెప్పుకొచ్చారు. ఆమ్రపాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి విశాఖపట్నం లో ఏయూలో ప్రొఫెసర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు.

పార్క్ హయత్ రహస్య భేటీ కుట్ర కోసమే : అంబటి రాంబాబు

జేడీ లక్ష్మీనారయణ వైసీపీలో చేరబోతున్నారా ?

సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల సాయం..!

ఏపీ నుంచి కొత్త రాజ్యసభ సభ్యులు వీరే..!

Loading...