జగన్, చంద్రబాబులపై పవన్ అస్త్రం ఇదే

966
Janasena Chief Pawan Kalyan New Political Strategy in Rayalaseema
Janasena Chief Pawan Kalyan New Political Strategy in Rayalaseema

ఉత్తరాంధ్రకు జనసేనాని పవన్ ఉన్నారు. దక్షిణ ఆంధ్రాకు మరో నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మరి సీఎంలను తయారు చేసే రాయలసీమకు జనసేన నాయకుడు ఎవరు? జగన్, చంద్రబాబు లాంటి ఉద్దండులు ఉన్న ప్రాంతంలో జనసేనకు సపోర్ట్ ఎవరు? అక్కడ ఎవరు వాయిస్ వినిపించాలి. అందుకే ఇప్పుడు రాయలసీమ వాసి అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు జనసేనాని పవన్ కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.

మొన్నటి ఎన్నికల ముందర జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు విశాఖ ఎంపీ సీటును ఇచ్చారు పవన్ కళ్యాణ్. కానీ ఆయన ఓడిపోయారు. స్వతహాగా రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో పోటీచేయడంతో అక్కడ అదృష్టం వరించలేదు.

ఇక పవన్ భీమవరం, గాజువాకలో పోటీచేసి ఓడిపోవడం.. ఉత్తరాంధ్రలో పవన్ కు ఇమేజ్ ఉన్న దృష్ట్యా ఆ ప్రాంతంలో మరో నాయకుడు అవసరం లేకుండా ఉంది. ఇక అమరావతి పరిధిలోని తెనాలి నుంచి పోటీచేసి ఓడిపోయిన మరో జనసేన నంబర్ 2 నాయకుడు నాదెండ్ల మనోహర్ దక్షిణ కోస్తాను చూసుకుంటున్నారు. కానీ రాయలసీమకు మాత్రం జనసేన వాయిస్ వినిపించే నేత లేకుండా పోయారు.

అందుకే పవన్ తాజాగా జనసేన రాయలసీమ బాధ్యతలను జేడీ లక్ష్మీనారాయణకు అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. విశాఖలో ఓడిపోయాక జనసేనలో యాక్టివ్ గా లేకుండా దూరంగా ఉన్నారు జేడీ. పవన్ సైతం తన పార్టీ పొలిట్ బ్యూరలో, జనరల్ బాడీలో జేడీని చేర్చుకోలేదు. జేడీ బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ చేరలేదు. తాజాగా పవన్ నిర్వహించిన విశాఖ లాంగ్ మార్చ్ లో జేడీ పాల్గొన్నారు. దీంతో ఆయనకు రాయలసీమ బాధ్యతలు అప్పగించి అక్కడ పార్టీని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలిసింది.

Loading...