జగన్ కొత్త సూత్రానికి ఫిదా అయిన మోడీ.. ?

1997
PM Modi Impress With YS Jagan
PM Modi Impress With YS Jagan

ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. ఏపీలో కరోనా మృతల కుటుంబాలకు సాయం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. తాజాగా దీనిపై ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. కరోనా కారణంగా చనిపోయిన వారి అంతక్రియలకు 15000 ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ జీవో జారీ చేశారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు 12 వేల కోట్లు విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశించారు. అలానే ప్లాస్మా అందజేసిన వారికి 5000 రూపాయలు అందజేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్లాస్మా థేరఫీపై ప్రజల్లో విసృతంగా అవగాహన కల్పించాలని.. దీనివలన మంచి ఫలితాలు ఉంటనే ప్రోత్సహించే ఛాన్సెస్ ఉన్నాయని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ప్లాస్మా దానం చేసినవారికి 5000 రూపాయలు ప్రోత్సహంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ డబ్బు వారికి మంచి భోజనం తీసుకొనేందుకు ఉపయోగపడుతుందని.. చెప్పినట్లుగానే దీనికి సంబంధించిన జీవో జారి చేశారు. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువయ్యాయి. అలానే మరణాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. తెలంగాణతో పోలీస్తే ఏపీలో కేసుల సంఖ్య ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం పరీక్షలు ఎక్కువగా చేయడమే అంటున్నారు నిపుణులు.

ఏపీలో జరిగిన పరీక్షలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. కరోనా పరీక్షల విషయంలో ఏపీ సర్కార్ సరికొత్త రికార్డులను బద్దలు కొడుతోంది. అందుకే ఇక్కడ కరోనా కేసులు కూడా ఎక్కువ నమోదు అవుతున్నాయని అంటున్నారు. ఇక్కడ కరోనాను కట్టడి చేసేందుకు సీఎం జగన్.. టెస్టింగ్, ట్రెసింగ్, ట్రీట్మెంట్ ఈ మూడు సూత్రలను తారకమంత్రంగా ఫాలో అవుతూ వస్తున్నారు. దీని అమలు చేసే రాష్ట్రాలు దేశంలో ఒక్కటో రెండో మాత్రమే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు ఎక్కువగా చేయడం లేదన్న ఆరోపనలు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం ఎక్కువగానే కరోనా పరీక్షలు చేస్తున్నారు.

కేవలం కరోనా పరీక్షల కోసమే ప్రభుత్వం రోజుకి 5 వేలు ఖర్చు చేస్తోంది. నేలకు 350 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ స్తాయిలో కరోనా పరీక్షలు చేస్తుండటంతో.. ఇప్పుడు రోజుకి 70 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. కరోనా పరీక్షలు పెరుగుతుందటంతోనే ఏపీలో కరోనా కేసులను గుర్తించడం సులువు అవుతోంది. ఏపీలో కరోనా ఎక్కువగా ఉందని కనిపిస్తున్నా.. మిగిలిన రాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువగానే ఉందన్న వారు లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి నయా ప్లాన్ కు మోడీ కూడా ఫిదా అయిపోయారు అనేవారు లేకపోలేదు. రానున్న రోజులో మరింత పాజిటివ్ గా జగన్ ముందుకు వెళ్తారని.. అందుకే శభాష్ అని కేంద్రం నుంచి ఫోన్ లు వస్తున్నాయని చెబుతున్నారు.

టీడీపీకి అమరావతి.. వైసీపీకి విశాఖ.. మరి జనసేనకు ?

టీడీపీ వేర్లు కూడా పీకేసిన జగన్.. సరికొత్త చరిత్రను లిఖించాడు..!

జగన్ తన వ్యూహాలతో బాబును తికమక పెట్టాడు.. ?

మూడు రాజ‌ధానులు.. నాలుగు జోన్లు.. 25 జిల్లాలు.. జ‌గ‌న్ పాలన అదరహో..!

Loading...