Friday, April 26, 2024
- Advertisement -

బాబుకు షాకింగ్ కౌంటర్……. జేసీ అనంతలో పార్టీని ముంచేస్తాడా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను…………మరీ ముఖ్యంగా రాయలసీమలో టిడిపి అవకాశాలను దెబ్బతీసే స్థాయి నిర్ణయం జేసీ దివాకరరెడ్డి తీసుకోబోతున్నాడా? అనంతలో టిడిపిని పూర్తిగా ముంచేసే స్థాయి నిర్ణయం జేసీల కుటుంబం నుంచి రాబోతోందా? ఇప్పుడు ఈ విషయాలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కమ్మ సామాజికవర్గానికి పూర్తి మద్దతుగా ఉన్న ప్రభోదానంద ఆశ్రమ స్వామీజీ తనను గౌరవించడం లేదని జేసీ దివాకరరెడ్డి నానా రచ్చా చేస్తున్నాడు. అయితే చంద్రబాబు మాత్రం ఓ వైపు జేసీకి సపోర్ట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తూనే మరోవైపు తన సామాజికవర్గ ప్రయోజనాలను మాత్రం కాపాడుతున్నాడు. చంద్రబాబు అనుసరిస్తున్న ఈ నైజం వెన్నుపోటు రాజకీయంలా ఉందని జేసీ తన అనుచరులతో ఘాటుగా మాట్లాడుతున్నాడు.

2014 ఎన్నికల సమయంలో అనంతపురంతో పాటు రాయలసీమ అభ్యర్థులకు చాలా మందికి ఆర్థిక సాయం చేశాడు జేసీ. అలాగే చంద్రబాబును మెప్పించడం కోసం జగన్‌కి పూర్తిగా శతృవు అవుతూ జగన్‌తో పాటు వైఎస్ కుటుంబంపై కూడా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాపకంతో రాజకీయంగా ఎదిగిన జేసీ వైఎస్ పంచన చేరి వైఎస్ పాదదాసుడిని అనే రేంజ్‌లో వైఎస్ దగ్గర అభిమానాన్ని నటించిన విషయాన్ని మర్చిపోయాడు. వైఎస్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ బాబును మెప్పించాడు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం జేసీలను ఏ విషయంలోనూ కనికరిచండం లేదు. ఇక ఇప్పుడు అనంతపురంలో జేసీల పరువుకు సంబంధించిన విషయంలో కూడా జేసీలకు హ్యాండ్ ఇచ్చాడు చంద్రబాబు. అందుకే ఇప్పుడు జేసీ దివాకరరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం గురించి ఆలోచిస్తున్నాడు. జేసీల కొడుకులతో పాటు, ముఖ్య అనుచరులను కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి స్థానాన్ని గెలుచుకోగలిగితే 2019 ఎన్నికలయ్యాక ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా తన అవసరం పడేలా ఉంటుందని వ్యూహరచన చేస్తున్నాడు జేసీ. అప్పుడు మంత్రి పదవులతో సహా అన్నింటినీ డిమాండ్ చేసి సాధించుకోవచ్చని భావిస్తున్నాడు. అయితే జేసీల వ్యూహం జేసీలకు ఎంత మేలు చేస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబు కోటరీకి వణుకు తెప్పిస్తోంది. అసలే రాయలసీమలో వైకాపా ధాటిని తట్టుకోలేని పరిస్థితి.

చంద్రబాబు పుట్టిన ఊరు ఉన్న నియోజకవర్గంలో పోటీచేయడానికి కూడా అభ్యర్థి దొరకడంలేదు. గల్లా అరుణకుమారి తప్పుకున్నారు. ఇంకా చాలా నియోజకవర్గంలో సరైన అభ్యర్థులు కూడా దొరకడం లేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు జేసీ దివాకరరెడ్డితో పాటు ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డి కూడా టిడిపిని వీడి వాళ్ళ పిల్లలతో పాటు, ముఖ్య అనుచరులను కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెడితే అనంతపురంలో టిడిపి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. పార్టీ శ్రేణులన్నీ ముందుగానే కాడి వదిలెయ్యడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే జేసీలను బుజ్జగించే ప్రయత్నం జోరుగా చేస్తున్నాడు చంద్రబాబు. అయితే జేసీ అడుగుతున్నట్టుగా ఆరు నుంచి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు జేసీ దివాకరరెడ్డి చెప్పినవాళ్ళకు ఇవ్వడానికి మాత్రం ససేమిరా అంటున్నాడు. ఈ మొత్తం వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి. జేసీలు కనుక స్వతంత్ర అభ్యర్థులుగా దిగితే మాత్రం అనంతపురంలో వైకాపా క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అన్న భయం చంద్రబాబు కోటరీలో వ్యక్తమవుతోంది. జేసీకి కూడా అదే విషయం చెప్తున్నారు. జగన్ గెలిస్తే జేసీలకు కూడా ప్రమాదం అని భయపెట్టి, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కాస్త మొండి పట్టుదల ఎక్కువ ఉండే జేసీ దివాకరరెడ్డి టిడిపి బుజ్జగింపులకు లొంగుతాడా? చంద్రబాబుతో కలిసే 2019 ఎన్నికలకు వెళ్తాడా? స్వతంత్రంగా పోటీ చేసే ప్రయత్నం చేస్తాడా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -