Saturday, April 27, 2024
- Advertisement -

వైసీపీ నేతల్లో ముదురుతున్న వివాదం..చేరికలు చాలు..?

- Advertisement -

చంద్రబాబు హయాంలో చంద్రబాబు అడ్డు అదుపు లేకుండా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీ లోకి చేర్చుని రాజకీయ న్యాయం లేకుండా వ్యవహరించారు. ఈ దెబ్బతో వైసీపీ పని ఖతం చేయాలనీ చంద్రబాబు వేసిన ప్లాన్ కి ప్రజలు ఇప్పుడు బాగానే బుద్ధి చెప్పారు. ఎంతమందినైతే టీడీపీ లాక్కుందో అంతేముంది ఈ ఎన్నికల్లో చంద్రబాబు కు రావడం ఇది జగన్ శాపమే అని ప్రజలు అనుకున్నారు.. దాంతో ఒక్కసారిగా ఢీలా పడ్డ చంద్రబాబు ఇప్పటివరకు కోలుకోలేదంటే జగన్ ఏ రేంజ్ లో ప్రజల్లో నాటుకుపోయాడో అర్థం చేసుకోవచ్చు..

అయితే  కొంతమంది టీడీపీ నేతలు అప్పుడు చంద్రబాబు చేసింది తప్పే కావచ్చు. ఇప్పుడు జగన్ చేసేది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.. వరుసగా టీడీపీ నేతలు వైసీపీ లోకి ఆహ్వానించడాన్ని వారు తప్పుబడుతున్నారు.. దానికి వైసీపీ నేతలు కౌంటర్లు విసురుతున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు కుటిల రాజకీయం తో ఎమ్మెల్యేలుగా ఉన్న వైసీపీ నేతలను మభ్యపెట్టి లాగేసుకున్నారు. కానీ జగన్ అలా కాదు ఎవరైనా వైసీపీ లోకి రావాలనుకుంటే రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు..వైసీపీ కి సపోర్ట్ గా ఉన్నప్పటికీ కొంతమంది టీడీపీ నేతలు ఇంకా రాజీనామా చేయలేదు.. ఇక ఇప్పుడు చేరుతున్న వారు కూడా కిందిస్థాయి నేతలు అని గుర్తు చేస్తున్నారు..

ఇక వైసీపీ నేతలు సైతం ఇలా టీడీపీ నేతలను చేర్చుకోవడం వారిని కొంత అసహనానికి గురిచేస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు కూడా టీడీపీ హయాంలో జరిగినట్టే జరుగుతోందన్న ఆవేదన వైసీపీలో ఉందట.. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు కండువా కప్పకుండా వాళ్ల కొడుకులకు.. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన వాళ్లకు డైరెక్ట్ గా కండువా కప్పుతున్నారు. అని అంటున్నారు.. టీడీపీకి వైసీపీకి ఏమీ తేడా ఉందని.. మొత్తానికి వాళ్ల స్వార్థం చూసుకొనే నాయకులు కార్యకర్తలు అభిమానులు రెండు పార్టీల్లో దెబ్బతినే పరిస్థితి వస్తోందని అంటున్నారు. తప్పితే జంప్ అయిన వాళ్లు ఆర్థికంగా లాభపడటం.. వాళ్ల కార్యకర్తలకు మేలు చేయడం తప్పితే.. ఏమీ లేదు అని.. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని గ్రామాల్లోని రచ్చబండ ఏరియాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -