వింత జబ్బులతో బాధపడుతున్న సెలబ్రిటీలు వీరే..!

1495
indian celebrities who suffered from serious health disorders
indian celebrities who suffered from serious health disorders
  • సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ 2011 సంవత్సరం లో ‘ఎమెసిస్’ అనే సమస్యతో ఫైట్ చేసారు. దీంతో శ్వాస నాళముల వాపు చెందడంతో కొన్నాళ్ళు ‘ఐ.సి.యు’ లో కూడా జాయిన్ అయ్యారు. దీనికోసం సింగపూర్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు.
  • అప్పట్లో ఇలియానా కూడా ‘బాడీ డిస్ మార్ఫిక్ డిసార్డర్ ‘ కి గురయ్యిందట. ఒక దశలో ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. తన బాడీ షేప్ పై కొందరు కామెంట్స్ చేయడంతో.. ఇలాంటి నిర్ణయానికి పడిపోయిందట. అయితే తనకు తనే ధైర్యం చెప్పుకుని ఈ సమస్య నుండీ బయట పడిందట. వైద్య నిపుణుల సందేశాలు క్రమంగా ఫాలో అయ్యేదట ఈ అమ్మడు. అలా తన డిసార్డర్ నుండీ బయటపడిందట.
  • ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన స్నేహా ఉల్లాల్ కూడా ‘ఆటో ఇమ్యూన్ డిసార్డర్’ తో బాదపడిందట. ఇది ఒక రక్తానికి సంబందించిన ఒక వ్యాదని. దీని వలన తన రోగ నిరోధక శక్తి లోభించిందని తెలిపింది. దీని వలనే ఇండస్ట్రీకి దూరమయ్యి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
  • ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార ‘స్కిన్ డిసార్డర్’ తో బాధపడుతున్నారట. మేకప్ లు వేసుకోవడం వలన తను ఈ డిజార్డర్ కి గురయ్యిందట. ముఖ్యంగా నాన్ వెజ్ తింటే ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుందట. దీనికోసం కేరళ వైద్యం, అలాగే ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటుందట.
  • అక్కినేని వారి కోడలు సమంత ‘పాలిమార్ఫస్ కాంతి విస్ఫోటనం’ తో బాధపడుతుందట. ఎండలో కాసేపు ఉంటే.. తన చర్మం ఎర్రబడిపోవడంతో పాటూ దురదలు కూడా మొదలయ్యి బాధిస్తుందట. బాగా రంగు ఉన్నవారికైతే ఇది మరింత బాదిస్తుందట. దీని కోసం సమంత ఎక్కువగా ఎండలో వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటుందని… షూటింగ్ సమయంలో ఈ పరిస్థితి రాకుండా దర్శక నిర్మాతలతో ముందుగానే చెబుతుందట.
  • ఇటీవలే.. రన్వీర్ ని వివాహం చేసుకున్న దీపికా పడుకోణె కూడా గతంలో డిప్రెషన్ కి గురయ్యిందట. ఈ వ్యాధి తో… ఎన్నో సమస్యలు ఎదుర్కొని.. చాలా ఒడుదుకులని ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుందట. చివరికి మంచి స్థాయిలో నిలబడింది దీపికా. తన లాగే ఇలా డిప్రెషన్ గురయ్యే వారికోసం ప్రత్యేకంగా ఓ మెడికల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసి.. కొందరు మానసిక వైద్యులతో చికిత్స ఇప్పిస్తుంది. డిప్రెషన్ తో బాధపడే… ఎంతో మందికి దీపికా సక్సెస్ ఓ స్ఫూర్తి.
Loading...