హాట్ బ్రేకింగ్ః ఆహ్వానించిన బాబు, లోకేష్‌లను ఎన్టీఆర్ ఘోరంగా అవమానించాడా?

5514
Jr NTR Shock With No Entry Board to Chandrababu..?
Jr NTR Shock With No Entry Board to Chandrababu..?

ప్రపంచానికి పాఠాలు చెప్పాను, చక్రం తిప్పాను అని డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు జీవితంలో అతి పెద్ద అవమానం నందమూరి కుటుంబం నుంచే తగిలిందా? నారా చంద్రబాబు, లోకేష్‌లకు జన్మలో మర్చిపోలేని అవమానాన్ని ఎన్టీఆర్ చూపించాడా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి టిడిపి వర్గాలు. అయితే నందమూరి కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది మాత్రం ఎన్టీఆర్‌నే సమర్థిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి నాయకత్వం ఎదగకుండా కుట్రలు పన్నుతూ నామ్ కే వాస్తే సీట్లు విదిలిస్తూ ఉంటే నందమూరి కుటుంబం అంతా చంద్రబాబుకు ఊడిగం చేస్తూ ఉండాలా అన్న ప్రశ్నలకు నందమూరి అభిమానుల నుంచి కూడా వినిపిస్తున్నాయి.

కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడా? చెయ్యడా అనే విషయంలో కనీసం మాటగా కూడా తనను అడగకుండా టిడిపి కోసం ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడు అని ఆంధ్రజ్యోతి, ఈనాడుతో సహా పచ్చ మీడియాలో చంద్రబాబు ప్రచారం చేయించడాన్ని ఎన్టీఆర్ సహించలేపోయాడు. అందుకే ఎన్నికల ప్రచారానికి మణికొండ వచ్చిన చంద్రబాబు స్వయంగా ఇంటికి వస్తానంటే ఎన్టీఆర్ నో చెప్పాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా తనతోనే ఉన్నాడు అని చంద్రబాబు ఆ రకంగా నిరూపించాలనుకున్నాడు. హరికృష్ణ చనిపోయిన తర్వాత స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి పరామర్శించినట్టుగా కూడా ఉంటుందన్న ఉద్ధేశ్యంతో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాలని బాబు ప్లాన్ చేశాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు తన ఇంటికి రావడాన్ని అస్సలు ఇష్టపడలేదట. ఎన్నికలయ్యాక కావాలంటే రావొచ్చని………ఇప్పుడు మాత్రం వద్దేవద్దని చెప్పాడట. 2009తోనే బాబు నైజం ఏంటో అర్థం అయిపోయిందని….ఇప్పుడు మరోసారి రాజకీయంగా నారా వారికి మద్దతు పలికే ప్రసక్తేలేదని చెప్పాడట ఎన్టీఆర్.

ఈ విషయాలన్నీ తాజాగా బయటికి వచ్చాయి. నందమూరి అభిమానులు ఎన్టీఆర్ గట్స్‌ని మెచ్చుకుంటున్నారు. ఏ రోజుకైనా స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన టిడిపిని మళ్ళీ నందమూరి వారి చేతుల్లోకి తెచ్చే సత్తా ఎన్టీఆర్‌కి ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. పైగా లోకేష్‌లాంటి కామెడీ నాయకుడిని మోయడానికి సిద్ధంగా లేమని కూడా చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే మొత్తం తెలుగు ప్రజలందరూ తనను అభిమానిస్తున్నారు…….అలాంటి క్యారెక్టర్ నాది అని చెప్పుకునే చంద్రబాబును స్వయంగా ఇంట్లోవాళ్ళు కూడా నమ్మలేని పరిస్థితి……….అలాగే బాబును కుట్ర రాజకీయాలకు ప్రతినిధిగా సొంత ఇంటి మనుషులే చూస్తూ ఉన్న పరిస్థితిని నారా వారు, టిడిపి నాయకులు ఎలా సమర్థించుకుంటారో చూడాలి మరి. ఎన్నికల ప్రచారానికి రమ్మని ఒకటికి పదిసార్లు చంద్రబాబు, లోకేష్‌లు పిలిచినప్పటికీ ఈ నందమూరి వారసుడు నారావారివి కుట్ర రాజకీయాలు అని చెప్పి ప్రచారానికి దూరంగా ఉండడం మాత్రం బాబు, లోకేష్‌లకు ఘోర అవమానమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.