Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణా ఎఫెక్ట్ ….. టిడిపికి జాతీయ పార్టీ హోదా గోవిందా

- Advertisement -

తెలంగాణాలో ఘోర పరాజయం చంద్రబాబును ఇప్పట్లో కోలుకోనిచ్చేలా లేదు. ఆల్రెడీ బిజెపి వ్యతిరేక కూటమికి మమతా బెనర్జీ ఇచ్చింది. కేసీఆర్‌ చెప్తున్న నాన్ బిజెపి, నాన్ కాంగ్రెస్ కూటమికి దీదీ జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఎపిలోనేమో టిడిపి నాయకులు వరుసగా వైకాపాలోకి జంప్ అవుతూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని రామోజీరావు, రాధాకృష్ణలాంటి చంద్రబాబు వీరభక్తులు కూడా ఘంటాపథంగా చెప్పలేకపోతున్నారు. ఇక టిడిపి నాయకుల్లో అయితే గుండెల్లో దడ మామూలుగా లేదు. ఆల్రెడీ దడ పుట్టిస్తున్న మోడీకి, ఇప్పుడు కేసీఆర్ కూడా జతకూడాడు.

ఇన్ని కష్టాల మధ్య ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు మరో సూపర్ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడెప్పుడో సోనియమ్మతో చీకటి వ్యవహారం నడిపి జగన్ దెబ్బకొట్టడం, సీమాంధ్రుల గొంతు కోస్తూ తెలంగాణా విభజనకు తెరవెనుక సహకరిస్తున్న టైంలో విభజన అయిన వెంటనే టిడిపికి జాతీయ హోదా తెచ్చుకున్నాడు కదా. అయితే ఇప్పుడు ఆ జాతీయ హోదాకు ఎసరు వచ్చేసింది. అసలే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ కదా. ఇప్పుడు తెలంగాణాలో కనీసం ఆరు శాతం ఓట్లు రావాల్సి ఉంటే కేవలం 3.5 ఓట్ల శాతం మాత్రమే తెచ్చుకోగలిగింది. తెలంగాణాలో చంద్రబాబుగారు కాలికి బలపం కట్టుకున్నట్టుగా సీమాంధ్ర ప్రజల సొమ్ముతో గల్లిగల్లీ తిరిగినప్పటికీ, అధికారంలో ఉన్న ఎపి నుంచి దోచేసిన కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేసినప్పటికీ తెలంగాణా ప్రజలు మాత్రం చంద్రబాబుకు ఘోరపరాజయం చూపించారని చాలా విశ్లేషణల్లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఘోర పరాజయం దెబ్బతో తెలంగాణాలో కేవలం 3.5 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న టిడిపి జాతీయ హోదా గల్లంతు కావడం ఖాయమైంది. విభజన కష్టాలతో సీమాంధ్రప్రజలు వేదన చెందుతూ ఉంటే కుమ్మక్కు రాజకీయాలతో తెచ్చుకున్న జాతీయ హోదా ఆ రకంగా మంటగలిసిపోవడం ఖాయం అయింది. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళుగా అప్పనంగా దోచుకున్నవాళ్ళకు 2019లో ఎపిలో ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా ఇంకా ఎన్నో షాకులు తగలడం ఖాయం అన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -