వాలంటైన్ వీక్.. స్పెష‌ల్స్ ఏంటో మీరూ చూడండి

2777
Valentine Week List 2019: February Special
Valentine Week List 2019: February Special

ఫిబ్ర‌వ‌రి అన‌గానే గుర్తొచ్చేది.. వాలంటైన్స్ డే. అదేనండి ప్రేమికుల దినోత్స‌వం. మ‌నం ప్రేమించిన అమ్మాయి క‌ళ్ల‌ముందు తిరుగుతున్నా మ‌దిలోని భావాల‌ను చెప్ప‌లేక స‌త‌మ‌త‌మ‌వుతూ.. కిందా మీదా ప‌డుతూ.. నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్న యువ‌తీ, యువ‌కులు… ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తుంటారు చూడండి.. ఆ రోజే ప్రేమికుల రోజు.

క‌ళ్ల‌తోనే మాట్లాడుతూ.. చెప్ప‌క‌ముందే అన్ని విష‌యాల‌ను అర్థం చేసుకుంటూ.. జీవితాంతం ఇంతే ప్రేమ‌ను అందించ‌గ‌ల‌మా అని ప‌దిసార్లు క్రాస్‌చెక్ చేసుకొని ఇక ఆఫిషియ‌ల్‌గా ఒక అడుగేయాల‌ని..ఒక‌రితో ఒక‌రు త‌మ‌ మ‌న‌సులోని భావాల‌ను చెప్పుకోవాల‌ని.. ఈ రోజునే ముహుర్తంగా పెట్టుకుంటారు.

త‌మ ఇష్ట‌స‌ఖిని/స‌ఖుడిని ఏం చేసి మెప్పించాలా అని తెగ మ‌ద‌న‌ప‌డి పోతుంటారు. ఏదేమైనా మొద‌టి సారి ప్ర‌పోజ్ చేయాల‌నుకునే వారికి ఆ వాలంటైన్ అనే మ‌హానుభావుడు ఇచ్చిన గొప్ప వ‌రం అనుకోవ‌చ్చు ఈ ప్రేమికుల దినోత్స‌వం.
కానీ ఫిబ్ర‌వ‌రిలో ఒక్క 14వ తేదీనే కాదు.. ఇంకా చాలా రోజుల‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లున్నాయి. అవేంటో చూద్దాం.

ఫిబ్ర‌వ‌రి 7 – Rose Day

ఫిబ్ర‌వ‌రి 7 – Rose Day

రోజా పువ్వు.. ప్రేమ‌కు చిహ్నం. మ‌నం ప్రేమించే, ఆరాధించే, ఇష్ట‌ప‌డే వ్య‌క్తుల‌కు రోజా పువ్వు ఇవ్వ‌డం ఓ సంప్రాదాయంగా వ‌స్తుంది. మ‌రి చాలా రంగుల రోజా పూలు ఉన్నాయి. ఒక్కో రంగుది ఒక్కో స్పెషాలిటి.
ప్రేమ‌కు- రెడ్ క‌ల‌ర్‌, స్నేహానికి గుర్తుగా- యెల్లో క‌ల‌ర్‌, శాంతికి అదేనండి ఎప్పుడూ గొడ‌వ ప‌డుతూ ఇక నుంచి వ‌ద్దు అనుకుంటారు చూశారా వారి కోసం వైట్ క‌ల‌ర్ రోజా. ఇలా ఎవ‌రికి సంబంధించిన రోజా పువ్వు వారికి ఇచ్చేసి మీ మ‌న‌సులోని భారాన్ని దించేసుకోండి.

ఫిబ్ర‌వ‌రి 8- Propose Day

ఫిబ్ర‌వ‌రి 8- Propose Day

మ‌న ల‌వ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయ‌డానికి వాలంటైన్స్ డే క‌రెక్ట్ అనుకుంటారు.. కానీ అలా ప్ర‌పోజ్ చేయ‌డానికి ఫిబ్ర‌వ‌రి 8 అనే ఓ రోజే ఉంది. సో మీ మ‌న‌సులో ప్రేమ తాలుకు దాచుకున్న ఫిలింగ్స్ అన్నింటిని ఈ రోజే బ‌య‌ట‌పెట్టేయండి.

ఫిబ్ర‌వ‌రి 9 – Chocolate Day

ఫిబ్ర‌వ‌రి 9 – Chocolate Day

మీ మ‌న‌సులో మీ ఫ్రెండ్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ల‌వ‌ర్ ఎవ‌రైనా ఓ చాక్‌లెట్ ఇచ్చి వారితో మ‌న‌సు విప్పి మాట్లాడండి. కానీ చాక్‌లెట్‌ను మాత్రం ఇవ్వ‌కూడ‌దు. ఎందుకంటే మనం రోజు మాట్లాడుతాం. ఈ రోజుకు చాక్‌లెటే స్పెష‌ల్ అనే విష‌యం మ‌ర్చిపోవద్దు.

ఫిబ్ర‌వ‌రి 10 – Teddy Day

ఫిబ్ర‌వ‌రి 10 – Teddy Day

ఐ ల‌వ్ యూ అని చెప్ప‌లేక పోతే ఈ రోజు ఓ టెడ్డి బియ‌ర్ ఇచ్చేయండి. చాలా మంది అమ్మాయిల‌కు టెడ్డి బియ‌ర్ అంటే ఎంత ఇష్ట‌మో మ‌న‌కు తెలిసిందే. వారికి ఇష్ట‌మైన‌ది ఇచ్చి వారికి మ‌న‌మెంత ఇష్ట‌మో తెలియ‌జెప్పండి.

ఫిబ్ర‌వ‌రి 11 – Promise Day

ఫిబ్ర‌వ‌రి 11 – Promise Day

మీ బంధం ధృడంగా ఉండడానికి ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈ రోజు చాలా మంచిదనే చెప్పాలి. మీరు మీ పాట్న‌ర్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో టెక్ట్స్ రూపంలో తెల‌పండి. అది మీ మ‌ధ్య బంధాన్ని మ‌రింత పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు.

ఫిబ్ర‌వ‌రి 12 -Hug Day


ఫిబ్ర‌వ‌రి 12 -Hug Day

మీరు రాసిన ప‌దాలు అంత‌గా ప్ర‌భావం చూప‌క‌పోతే.. ఓ హ‌గ్ ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తుంది.

ఫిబ్ర‌వ‌రి 13 -Kiss Day

ఫిబ్ర‌వ‌రి 13 -Kiss Day

ఓ ముద్దు చెప్పే నిజం.. మాటల్లో కూడా ఉండ‌ద‌ట‌. ఒక‌రి మీద ఒక‌రికున్న అఫెక్ష‌న్‌, ల‌వ్‌కు ఎక్స్‌ప్రెస్ చేయాలంటే ముద్దును మించిన‌ది మ‌రోక‌టి లేద‌నే చెప్పాలి.

ఫిబ్ర‌వ‌రి 14- Valentine’s Day

ఫిబ్ర‌వ‌రి 14- Valentine’s Day

ఇక మీరు ఎదురుచూసే వాలంటైన్స్ డే వ‌చ్చేసింది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ముందే అన్ని మాట్లాడేసుకున్నాం. ఇంకేందుకాలస్యం ఈ వాలంటైన్ వీక్‌లోని ప్ర‌తి రోజును జీవితంలో మ‌రిచిపోలేని ఓ అనుభూతిగా మ‌లుచుకోండి. మాతో కూడా మీ ల‌వ్‌స్టోరిని పంచుకోవాలంటే.. మీ క‌థ‌ను మాకు మెయిల్ చేయండి.

Loading...