Tuesday, March 19, 2024
- Advertisement -

అప్ప‌టి వ‌ర‌కు విశ్రాంతి లేద‌న్న హార్డ్‌ హిట్టర్‌…

- Advertisement -

పంచ‌క‌ప్ నేప‌ధ్యంలో ఇంగ్లండు వెల్ల‌నున్న హార్ధిక్ పాండ్యా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి తీవ్రంగానె శ్రమిస్తున్నాడు. దేశం తరుపున ప్రపంచకప్‌ ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్‌ కోరుకుంటాడు. దాని కోసం ఎంతవరకైనా, ఎందాకైనా కష్టపడతారు. ప్రస్తుతం టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా అదే చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో పాండ్య అద్భుత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చారు.ఆటగాళ్లందరూ బాగా అలసిపోయి ఉండటంతో ప్రపంచకప్‌ మొదలయ్యే లోపు కొన్ని రోజులు సేద తీరమని బీసీసీఐ టీమిండియాకు సూచించింది. అయితే పాండ్య మాత్రం ఆ సమయాన్ని ఫిట్‌నెస్‌ కోసం వెచ్చిస్తున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పటి వీడియోను పాండ్య సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఎలాంటి విశ్రాంతి తీసుకోవ‌డంలేదంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో నెటిజ‌న్లు పాండ్యాను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

కాఫీ విత్‌ కరణ్‌’ షో వివాదం తర్వాత హార్దిక్‌లో చాలా పరిణితి వచ్చిందని, ఐపీఎల్‌లో అతడి ఆట, నడవడికలో చాలా మార్పు వచ్చిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్‌ వేదికగా మే30 నుంచి క్రికెట్‌ విశ్వసమరం ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌లో ఈ సారి హాట్‌ఫేవరేట్‌ బరిలోకి దిగుతున్న టీమిండియాలో హార్దిక్‌ పాండ్యా కీలకఆటగాడ‌న్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -