టీ20లకి కోహ్లీ గుడ్‌ బై.. ఎప్పుడు ? ఎందుకు ?

1514
indian captain virat kohli hints at retiring from one of the formats after 2023 world cup
indian captain virat kohli hints at retiring from one of the formats after 2023 world cup

టీమిండియా బిజీ షెడ్యూల్‌పై ఇటీవల పెదవి విరిచిన భారత కెఫ్టెన్ విరాట్ కోహ్లీ.. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతానని ప్రకటించాడు. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుండగా.. తాజాగా మీడియా సమావేశం అయ్యారు.

” 2021లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత ఏదైన ఒక ఫార్మెట్ లో తప్పుకునే ఆలోచన ఉందా ?” అంటూ కోహ్లీని మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. అందుకు కోహ్లీ జవాబు ఇస్తూ..’ 2023 వరకూ అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత ఒకసారి పునరాలోచించుకుంటాను. ఎందుకంటే.. గత ఎనిమిదేళ్లుగా ఏడాదిలో కనీసం 300 రోజులు క్రికెట్‌ కోసం కేటాయిస్తున్నాను. అయితే.. బిజీ షెడ్యూల్ కారణంగా మేము కూడా వ్యక్తిగతంగా కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాం. కానీ.. మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకి అది సాధ్యం కావడం లేదు.

మరోవైపు టీమ్ నా నుంచి గెలిపించే ప్రదర్శన ఆశిస్తోంది. కాబట్టి.. మరో మూడేళ్లు వరకూ మూడు ఫార్మాట్లలో ఆడతాను. తర్వాత ఒక ఫార్మెట్ నుండి తప్పుకోవడంపై ఆలోచిస్తా” ని చెప్పుకొచ్చాడు. 2008, ఆగస్టులో విరాట్ కోహ్లీ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 248 వన్డేలు, 84 టెస్టులు, 81 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇక టీ20ల్లో పదో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో వన్డే, టెస్టుల్లో కొనసాగుతూ.. టీ20లకి రిటైర్మెంట్ ఇచ్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Loading...