టికెట్ బస్సు ఎక్కి దొరికిన కోహ్లీ..!

- Advertisement -

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఏ మ్యాచ్ లు లేకపోవడంతో చాలా మంచి క్రికెట్ ప్లేయర్లు ఇంట్లోనే ఉంటున్నారు. కొంత‌మంది క్రికెట‌ర్లు సోష‌ల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ తమ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తాజాగా స్టార్ ఫుట్‌బాల‌ర్ సునీల్ చెత్రీతో టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ వివిధ అంశాల‌పై చ‌ర్చించాడు.

ఈ సంద‌ర్భంగా ఎప్పుడైనా టికెట్ లేకుండా బ‌స్సులో ప్ర‌యాణించావా అని కోహ్లీని చెత్రీ గమ్మతైన ప్రశ్న అడిగాడు. అందుకు కోహ్లీ మంచి జవాబు ఇచ్చాడు. కెరీర్ మొదట్లో బస్సులో ప్రయాణం చేసినప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం చేసి కండక్టర్ కి దొరికానని చెప్పాడు. అప్పట్లో బస్సులో టికెట్ తీసుకోని వారు పాస్ అనో లేక్ స్టాఫ్ మెంబర్ అనో చెప్పేవారని పేర్కొన్నాడు. ఇలా చాలా మంది ఫ్రీగా ప్రయాణం చేసేవారని గుర్తు చేసుకున్నాడు.

- Advertisement -

అయితే తనని చూసి ఎవరు కూడా స్టాఫ్ మెంబర్ గా భావించేవారు కాదని అభిప్రాయపడ్డాడు. స్టాఫ్ మెంబ‌ర్‌గా క‌న్పించాలంటే అందుకు తగ్గ పర్సనాలిటీ ఉండాలని.. తాను అలా కనిపించేవాడ్ని కాదని కోహ్లీ తెలిపాడు. ఒక‌సారి బ‌స్సులో ప్ర‌యాణం చేస్తుంటూ స్టాఫ్ అని చెప్పాన‌ని, అయితే పాస్‌ను చూపించాల‌ని కండ‌క్ట‌ర్ కోరాడ‌ని తెలిపాడు. వెంట‌నే తాను బ‌స్సు నుంచి దిగిపోయాన‌ని కోహ్లీ పేర్కొన్నాడు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...