Friday, April 26, 2024
- Advertisement -

జట్టులో ధోనీ లేకుంటే… కోహ్లీ సక్సెస్ కాలేడు : వసీం జాఫర్

- Advertisement -

ధోనీ కెప్టెన్సీలో కోహ్లీకి చాన్నాళ్లు క్రికెట్‌ ఆడటం అతనికి చాలా ఉపయోగపడింది. ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. తన సత్తా చాటుతున్నాడు. టీమిండియాను ఉన్నత స్థానంలో నిలిపాడు కోహ్లీ. అయితే కీలక సమయాల్లో కోహ్లీకి ధోనీ సలహాలు ఇచ్చేవాడు. ముఖ్యంగా డీఆర్‌ఎస్ రివ్యూలలో అయితే ధోనీ లేకపోతే కోహ్లీ డీఆర్‌ఎస్ రివ్యూలను కోరడంలో సక్సెస్ కాలేడని మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ అభిప్రాయపడ్డాడు.

తాజాగా వసీం జాఫర్ టైమ్స్ నౌతో మాట్లాడుతూ… “ధోనీ రిటైర్మెంట్ గురించి అందరు అంచనాలు వేస్తున్నారు. ధోనీ ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు రెడీ అయ్యారు. చెన్నైలో ప్రాక్టిస్ కూడా చేశాడు. బహుశా ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ కెరీర్‌పై ఓ క్లారిటీ వస్తుందనుకుంటున్నా. ధోనీ రిటైర్మెంట్ రూమర్స్‌ ఇటవల చాలా ఎక్కువ అయ్యాయి. ధోనీ ఇలాంటివి పట్టించుకోడు. మహీ ఏ నిర్ణయం తీసుకున్నా.. సరైనదిగానే ఉంటుంది. టీ20ల్లో ఇప్పటికీ ఎంఎస్ ధోనీ బెస్ట్ క్రికెటర్.

ఒకే ఓవర్లో మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. బెస్ట్ ఫినిషర్. అంతేకాకుండా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి మైదానంలో చాలా విషయాల్లో అతను సాయం చేస్తున్నాడు. అందులో డీఆర్‌ఎస్ రివ్యూలు కూడా ఉంటాయి. ఒకవేళ ధోనీ జట్టు‌లో లేకపోతే చాలా డీఆర్‌ఎస్ రివ్యూలు ఫెయిలవుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అని మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -