Saturday, April 27, 2024
- Advertisement -

పాక్ కెప్టెన్ స‌ర్ప‌రాజ్ కు ఘోర అవ‌మానం ….ఈ క‌ష్టం ప‌గోడికి కూడా రాకూడ‌దు

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ తో జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ ఘోరంగ ఓడిపోవ‌డంతో ఆ దేశ అభిమానుల్లో ఇంకా ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు. ఇప్ప‌టికే అన్ని వైపుల‌నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కెప్టెన్ స‌ర్ప‌రాజ్‌ను అయితే సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా స‌ర్ప‌రాజ్‌కు అనుకోని దుర‌దృష్ట‌సంఘ‌ట‌న ఎదుర‌య్యింది.

కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన సర్ఫరాజ్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్‌ కెప్టెన్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. ‘సర్ఫరాజ్‌ బాయ్‌.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్‌ చేయవచ్చు కదా’ అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. కాని స‌ర్ప‌రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోయారు.వీడియో షేర్ కావడంతో పాపం సర్ఫరాజ్ అవమానాల పాలయ్యాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా.. నెటిజన్లు ఆ అభిమాని చర్యను తప్పుబడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. ‘నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్‌కు నేర్పించింది’ అంటూ మండిపడుతున్నారు. వీడియో షేర్ కావడంతో పాపం సర్ఫరాజ్ అవమానాల పాలయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -