Saturday, April 27, 2024
- Advertisement -

ఆసిస్ మాజీ క్రికెటర్ వార్న్ కు బిగ్ షాక్.. ఏడాది పాటు నిషేధం

- Advertisement -

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌కు లండన్ కోర్టు బిగ్ షాకిచ్చింది. మితిమీరిన వేగంతో కారు డ్రైవ్‌ చేయడంతో అతని డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏడాది పాటు నిషేధించారు. షేన్‌ వార్న్‌ ఆరోసారి ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా అతను ఏడాది పాటు కారు నడపకుండా ఉండాలని వింబుల్డన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వార్న్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఐదుసార్లు ఉల్లంఘించాడు. మరో సారి ట్రాఫిక్ ఉల్లంగించడంతో దీనిని తీవ్రంగా పరిగణించిన వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టు అతడిపై ఏడాదిపాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధించింది. అంతేకాక.. రూ.1.62 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.జాగ్వర్‌ కారును అద్దెకు తీసుకున్న వార్న్‌.. 40 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన కెన్‌సింగ్టన్‌ జోన్‌లో 47 మైళ్ల వేగంతో వెళ్లడంతో అతనిపై నిషేధానికి కారణమైంది.2016 మొదలుకొని గతేడాది ఆగస్టు వరకూ వార్న్‌ లైసెన్స్‌పై 15 పాయింట్లు ఉండటం గమనార్హం. దాంతో మరోసారి ట్రాఫిక్‌ నిబంధనల్ని అతి క్రమించడంతో వార్న్‌కు శిక్ష తప్పలేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -