Friday, May 3, 2024
- Advertisement -

ప్రపంచ క్రికెట్‌లో నెంబర్ వన్ ఫీల్డర్ జడేజానే : గంభీర్

- Advertisement -

ప్రపంచ క్రికెట్‌లో రవీంద్ర జడేజానే బెస్ట్ ఫీల్డర్ అని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రశంసించారు. తాజాగా ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్‌ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్లు ఫిజికల్ ఫిట్ నెస్ లో రాజీపడటం లేదని.. దీంతో ఫీల్డింగ్‌ ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు.

జడేజా భారత్ తరఫున 49 టెస్టులు, 165 వన్డేలు, 49 టీ20ల ఆడాడు. మరోవైపు 170 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో మంది బెస్ట్‌ ఫీల్డర్లు ఉన్నప్పటికీ జడేజానే అందరికంటే బెస్ట్ అని గంభీర్ అభిప్రాయపడ్డారు. “ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో జడేజానే అత్యుత్తమ ఫీల్డర్‌. నాణ్యమైన ఆల్‌రౌండర్‌. బంతితో మాయ చేయగలడు.

అలానే మెరుపు ఫీల్డింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగలడు. ఔట్‌ఫీల్డ్‌, కవర్స్‌లో జడేజాను మించిన ఫీల్డర్‌ మరోకరు ఉండరు. ఏ ఫీల్డింగ్‌ పొజిషన్‌ నుంచైనా బంతిని వికెట్లపైకి నేరుగా విసరగల సామర్థ్యం గల ఆటగాడు జడేజా. బంతి అతడి చేయి దాటి పక్కకుపోదు” అని గంభీర్ అన్నారు.

చాలాసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. : మహ్మద్ షమీ

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ని అమ్మేశాం : శ్రీలంక మాజీ క్రీడామంత్రి

డివిలియర్స్‌లోని సామర్థ్యం.. గేల్‌కు ఉన్న బలం.. కోహ్లీకి లేదు : గంభీర్

ధోనీ ఎవరూ హిట్టింగ్ చేయడం నేను చూడలేదు : అశ్విన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -