Saturday, April 20, 2024
- Advertisement -

ఆ జ‌ట్టు ఒక్క టెస్టు కూడా గెల‌వ‌దు.. ఇది త‌థ్యం!

- Advertisement -

త‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా చెప్ప‌డంలో ముందుంటాడు భార‌త మాజీ క్రికెట‌ర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌. ఆట‌కు వీడ్కోలు ప‌లికి రాజ‌కీయాల్లోకి దిగినా కూడా రెండింటినీ బ్యాలెన్్స చేసుకుంటూ అటు పొలిటిక‌ల్ కెరీర్‌లో దూపుకుపోతూనే, ఇటు క్రికెట్‌కు సంబంధించి అంశాల‌పై త‌న‌దైన స్టైల్లో స్పందిస్తూ ఉంటాడు. ఇక మొన్న ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా విజ‌యాన్ని ప్ర‌శంసించి గౌతీ ఇప్పుడు, స్వ‌దేశంలో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టుకు కూడా భార‌త్ ఇలాంటి చేదు అనుభ‌వాన్నే మిగులుస్తుంద‌ని అన్నాడు. ప‌ర్యాట‌క జ‌ట్టు ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్ కూడా గెలిచే అవ‌కాశం లేద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

ఇండియ‌న్ పిచ్‌లు స్పిన్నర్‌లకు అనుకూల‌మైన‌వ‌ని, కాబ‌ట్టి బ్రిటీష్ జ‌ట్టు త‌మ‌కున్న‌ పేలవమైన స్పిన్‌ అటాక్‌తో బరిలోకి దిగుతుందని, ఇది భార‌త జ‌ట్ట‌కు కలిసొచ్చే విషయమన్నాడు. ఇంగ్లండ్ ప్ర‌ధాన స్పిన్న‌ర్ మొయిన్‌ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ ఇక్క‌డ అంత‌గా రాణించ‌లేర‌ని పేర్కొన్నాడు. స్వ‌దేశంలో మ‌రింతగా రెచ్చిపోయి ఆడే టీమిండియా బ్యాట్్స‌మెన్, ఇంగ్లండ్ బౌల‌ర్లు డామ్‌ బెస్‌, జాక్‌ లీచ్‌లకు చుక్క‌లు చూపిస్తార‌ని గంభీర్ ధీమా వ్య‌క్తం చేశాడు.

ఆసీస్‌పై విజ‌యంతో స‌రికొత్త జోష్‌లో ఉన్న టీమిండియా త‌న అనుభ‌వంతో నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను‌ 3-0 లేదా 3-1 తేడాతో నెగ్గుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశాడు. అయితే పింక్‌ బాల్‌తో జరిగే టెస్ట్‌లో మాత్రం ఇరు జట్లకు సమానమైన అవకాశాలు ఉంటాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఆసీస్‌లో ఆక‌ట్ట‌కున్న టీమిండియా బౌలర్లు బూమ్రా, అశ్విన్‌లు ఈ సిరీస్‌లో కూడా కీలకం కానున్నారన్నాడు. కాగా, ఫిబ్ర‌వ‌రి 5 నుంచి భారత్-‌ ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మొద‌లుకాబోతుంది.

8 నెలలు ఆగి కోహ్లీ కుమార్తె పేరు, గ్రేట్ కదా!

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -