ఒకప్పుడు తెలుగులో అగ్రహీరోయిన్ గా ఓ వేలుగువేలిగింది త్రిష. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలందరితోను నటించింది త్రిష. ఇదంతా ఒకప్పటి విషయం…. వరుస ప్లాపులతో బాధపడుతున్న సమయంలో త్రిషకు -ధర్మయోగి- రూపంలో ఓ హిట్ వచ్చిపడింది. అంతేకాదు అందులో తన నటనకు విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుంది.
ఈ సినిమా సక్సెస్ తో మళ్లీ ఫామ్ లో కొచ్చిన త్రిష.. ప్రస్తుతం -మోహిని- అనే హర్రర్ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. దీనికి భారీ స్పందనే వచ్చింది. కానీ ఆ ఫస్ట్ లుక్ విషయంలో కొన్ని మీడియా సంస్థలు చేసిన పనికి త్రిషకు చిర్రెత్తుకొచ్చిందట. అదేమిటంటే.. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పై కొన్ని మీడియా సంస్థలు డబుల్ మీనింగ్ వచ్చేలా శీర్షికలు పెట్టాయట.
అదెలాగంటే -త్రిష బ్లూ ఫిలింకి భారీ రెస్పాన్స్ వస్తోంది-…. అని రాశాయట. ఇది చూసిన త్రిష షాక్ కు గురైందట. పోస్టర్ మీద బ్లూ కలర్ షేడ్స్ ఉన్నంత మాత్రాన అది బ్లూ ఫిల్మ్ అయిపోతుందా?, అయినా డబుల్ మీనింగ్ వచ్చేలా అలా ఎలా రాస్తారని సదరు మీడియా సంస్థలపై సన్నిహితుల దగ్గర ఆక్రోషాన్ని వెల్లగక్కిందట. అయితే తన సినిమాకు ఇలాగైనా ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనుకుందో ఏమో తెలియదు గానీ… ఇప్పటి వరకు త్రిష ఈ విషయంపై బహిరంగంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.
Related