Sunday, May 5, 2024
- Advertisement -

విగ్రహాల ధ్వంసంపై ఏపి సీఎం జగన్ సీరియస్ వార్నింగ్!

- Advertisement -

ఏపీలో ఇటీవల కొంత మంది సంఘ విద్రోహులు హిందు దేవాలయాలను టార్గెట్ చేసుకొని విధ్వంసాలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రామాలయంలో రాముల వారి విగ్రహ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. గత రాత్రి రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై బీజేపీ నేతలు మాటల యుద్దానికి దిగారు.

రామతీర్థంలో ఘటన మరువకముందే రాజమండ్రిలో అదే తరహా ఘటన జరగడం దురదృష్టకరమని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం వంటి చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్ గా హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడితో చెలగాటమాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. . విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవుడితో చెలగాటమాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. దేవుడితో పెట్టుకుంటే తప్పకుండా శిక్షిస్తాడని పేర్కొన్నారు.

30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారు?

పురాణ పాత్రలకు ప్రాణం పోసిన ఐదుగురు నటీమణులు

ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బిగ్‌బాస్‌: నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -