బిగ్‌బాస్‌: నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్‌ రియాల్టీ రియాలిటీ షో బిగ్‌బాస్‌–4 షోకు శుభం కార్డు పడింది. స్టార్‌ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ గ్రాండ్‌ ఫినాలే గత ఆదివారం ముగిసింది. ఈ రియాలిటీ షో విజేతగా వర్ధమాన నటుడు, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రం ఫేమ్‌ అభిజిత్‌ నిలిచాడు.కరోనా సమయంలో ఎన్నో అనుమానా మధ్య వచ్చిన బిగ్‌బాస్‌-4 సక్సెస్‌లో ముఖ్యపాత్ర పోషించింది మాత్రం హోస్ట్‌ నాగార్జున అనే చెప్పొచ్చు. షోలో ఎక్కువ కొత్త ముఖాలే ఉండటం.. ఐపీఎల్‌ లాంటివి అడ్డకుంలు వచ్చినప్పుడు.. అన్ని తానై షోని విజయవంతంగా నడిపించాడు. నాగార్జున హోస్ట్‌గా మొదట్లో ఆకట్టుకున్నా కూడా మధ్యలో కొన్నిసార్లు నిర్వాహకుల చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మళ్లీ గాడిన పడ్డాడు. షో సక్సెస్‌లో కీలక పాత్ర వహించాడు.

ఇవన్నీ ఇలా ఉంటే ఈ షో చేసినందుకు గానూ నాగార్జునకు భారీగానే రెమ్యునరేషన్ అందిందని తెలుస్తుంది. ఈ షో కోసం సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు నాగ్. 30 ఎపిసోడ్స్‌కు అగ్రిమెంట్ చేసుకున్నాడు కూడా మధ్యలో రెండు ఎపిసోడ్లకు దూరం అయ్యాడు నాగార్జున. వైల్డ్ డాగ్ షూటింగ్ కారణంగా ఆయన రెండు ఎపిసోడ్లు చేయలేదు. అయితే దానికి సంబంధం లేకుండా షో నిర్వాహకులు రూ. 7 కోట్లు ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

ఇక బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్ కేవలం 13 ఎపిసోడ్లకే అప్పట్లో 8 కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక రెండో సీజన్‌ హోస్ట్‌ నాని కూడా 7 కోట్ల వరకు తీసుకున్నాడు. ఇప్పుడు నాగార్జున కూడా నానితో సమానంగా తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.ఇక ఈ షో విజేత అభిజీత్ 25 లక్షలు గెలుచుకోగా.. మూడోస్థానంలో నిలిచిన సోహెల్ మాత్రం 25 లక్షలతో పాటు మరిన్ని డబ్బులు కూడా అందుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -