Friday, May 3, 2024
- Advertisement -

30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారు? : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి గవర్నర్‌ వద్దకు వెళ్లిన బండి సంజయ్‌ జీహెచ్‌ఎంసీ నూతన కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని తమిళిసైను కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని.. అందుకు ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన తీర్పే సాక్ష్యం అని అన్నారు.

ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని వ్యాఖ్యానించారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అంతే కాదు.. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి విషయం అతన్నే అడిగి చెప్తానన్న సంజయ్‌ 30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బల్దియా ఎన్నిక జరిగి నెల గడిచినా ఇంకా గెజిట్ ఇవ్వలేదని దుయ్యబట్టారు.  మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. 

దేవునితో చెలగాటం వద్దు..

రేవంత్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉంది..

దేవుడి ఎదుటకు మరో టీడీపీ ఎమ్మెల్యే!

న్యాయవాదుల బీమా పథకానికి లైన్ క్లియర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -