- Advertisement -

‘హైదరాబాద్ సిస్టర్స్’ గాయని కుమారి లలిత కన్నుమూత!

- Advertisement -

సంగీత ప్రపంచాన్ని దశాబ్దాలపాటు అలరించిన ప్రముఖ గాయనీ ‘హైదరాబాద్ సిస్టర్స్’‌లో ఒకరైన కుమారి లలిత నిన్న హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. లలిత 6 అక్టోబరు 1950లో జన్మించారు. తల్లి బి. సరోజ వద్దే సంగీత శిక్షణ ప్రారంభించిన లలిత తొమ్మిదో ఏటనే హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో తొలి కచేరీ ఇచ్చి సంగీత అభిమానులను తనదైపు తిప్పుకుంది.

ఆమె సంగీతానికి ఎంతో మంది ముగ్దులయ్యారు. లలిత, హరిప్రియలు తమ జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు.  ఈ అక్కాచెల్లెల్లు ఎంతో మంది శిష్యులను తయారు చేశారు. ఈ నెల 20న ఉప్పలపాటి అంకయ్య 107వ జయంతి సందర్భంగా లలిత, హరిప్రియలు యూట్యూబ్‌లో ప్రత్యక్ష కచేరీ చేశారు. కాాగా, కార్డియాక్ అరెస్ట్‌తో ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. ఓట‌ర్ల దుస్తులు ఉతికిన అభ్యర్థి

రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐదుగురు జవాన్ల మృతి

కరిన్ స్టోల్‌తో భేటీ.. మరో మెట్టు ఎక్కిన ఆంధ్ర ప్రదేశ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -