విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో.. పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి, జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్‌తో సమావేశమయ్యారు. బొమ్మలు, వైద్య పరికరాల తయారీలో జర్మనీ పెట్టుబడులకు ఆసక్తి చూపుతోందని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం రెండేళ్లుగా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు.
ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఏపీఐఐసీ ప్రజంటేషన్ ఇచ్చింది. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు జర్మన్ కాన్సూల్ జనరల్‌కు మంత్రి వివరించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.
ఎయిర్ పోర్టులు, ఇండస్ట్రియల్ నోడ్లు, ఈఎంసీలు, పోర్టులు, హార్బర్లు సహా మౌలిక సదుపాయాల గురించి.. అధికారులు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జర్మని కాన్సులేట్ జనరల్ తెలుసుకున్నారు. ఉత్పత్తి రంగంతోపాటు సౌర విద్యుత్ తదితర అంశాలపై.. ఏపీ ప్రభుత్వంతో చర్చించామని కరిన్స్టోల్ వెల్లడించారు.
ఏపిలో రెడ్ అలెర్ట్.. ఒకే కళాశాలలో 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్..!
