రోజు రోజుకూ సూపర్‌స్టార్ మహేష్ బాబు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ల స్నేహం బాగా బలపడుతోంది. ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్‌లో రెండు బలమైన ఫ్యామిలీలకు చెందినవారు. వీరిద్దరి డీప్ స్నేహంపై టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే ఆ రెండు ఫ్యామిలీలు కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ స్టార్ హీరోలు మరో సారి కలిసి పారీ చేస్కున్నారట.
తాజాగా హైదరాబాద్‌లోని మహేష్ సతీమణి నమ్రత పుట్టినరోజు వేడుకలు ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆదివారం (జనవరి 22) గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారట చరణ్, ఉపాసన. చాలా కొద్ది మందిని మాత్రమే ఈ పార్టీకి ఆహ్వానించాడట మహేష్. ఈ పార్టీకి దర్శకుడు కొరటాల శివ, మెహర్ రమేష్, మహేష్‌కు ఇండస్ట్రీలో బాగా కావాల్సిన వారు మాత్రమే హాజరయ్యారట. ఇలా చాలా మంది ప్రముఖులు వచ్చినా.. చరణ్, ఉపాసనలే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచారట.
అంతేకాకుండా మహేష్, చరణ్ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయట. త్వరలో వీరిద్దరూ భాగస్వాములుగా ఓ హోటల్ బిజినెస్‌ను ప్రారంభించబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. కాగా, చరణ్, మహేష్‌ల మధ్య ఫ్రెండ్‌షిప్ బలపడడానికి కారణం ఉపాసన, నమ్రతల స్నేహమే కారణమన్న టాక్ వినిపిస్తోంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఫ్యూచర్‌లో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చిత్రం కూడా రాబోతుందని టాలీవుడ్ వర్గాల నుంచి తెలుస్తోంది.
Related
