దర్శకధీరుడు బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ హోదా కూడా అమాంతం పెరిగింది. ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలు తెలుగులోకి వచ్చేవి.కానీ బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమాలు పలు భాషలలో విడుదల కావడం వల్ల తెలుగు సినిమాలకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలన్నీ పాన్ కూడా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ రెమ్యునరేషన్ ని కూడా అమాంతం పెంచేశారు.
ప్రస్తుతం అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు. బాహుబలి ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఒక్క సినిమాకు 80 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు ఏకంగా 65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ సమాచారం. ఇక మహేష్ బాబు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్.
Also read:అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?
ఇకపోతే అరవింద సమేత చిత్రం వరకు పాతిక కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా తన రెమ్యూనరేషన్ 40 కోట్లకు పెంచారు. రామ్ చరణ్ తేజ్ కూడా 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు సినిమాకు విరామం తెలిపిన మెగా పవర్ స్టార్ ఆచార్య సినిమాకు 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. పుష్ప సినిమాకు 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తరువాత తీయబోయే పుష్ప పార్ట్ 2 కోసం ఏకంగా 50 కోట్లు డిమాండ్ చేశారని తెలుస్తోంది.గతంలో ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే బాలయ్యబాబు ప్రస్తుతం రెమ్యూనరేషన్ 10 కోట్లకు చేరిందని తెలుస్తోంది. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో మన హీరోలు అందరూ ఒక్కసారిగా వారి రెమ్యూనరేషన్ పెంచారు.
